ETV Bharat / bharat

పురుషాధిక్యతకు చెక్​.. సైన్యంలో సమన్యాయం - Indian army updates

ఆడవారు వంటగదికే పరిమితమన్న మాటల్ని చెరిపేస్తూ.. నవసమాజానికి తగ్గట్లుగా అన్నిరంగాల్లోనూ రాణిస్తున్నారు. ఇక మిగిలింది సైనిక విభాగమే. ఇన్నాళ్లూ పురుషులే నడిపిస్తూ వచ్చిన సైన్యంలో రాబోయే కాలంలో స్త్రీలు భాగస్వాములు కానున్నారు. నైతిక బలానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ మాటల్ని స్ఫురిస్తూ.. పురుషాధిక్య భావజాల సమాజంలో అన్నిరంగాల్లో వృద్ధిచెందిన నారీమణులకు భారత సైనికదళంలో అవకాశం కల్పించారు జనరల్​ బిపిన్​ రావత్​.

Women are equal to men and she will join the Indian Army
సైన్యంలో సమ న్యాయం
author img

By

Published : Feb 19, 2020, 7:50 AM IST

Updated : Mar 1, 2020, 7:26 PM IST

ఆడవారిపై అబల అన్న ముద్ర వేయడం అసంబద్ధం... నైతిక బలమే ప్రామాణికమైతే మగవారికన్నా స్త్రీలే అత్యంత శక్తి సంపన్నులు’ అని ఏనాడో తీర్మానించారు మహాత్మాగాంధీ. పురుషాధిక్య భావజాల సమాజం వేసిన సంప్రదాయాల సంకెళ్లను ఛేదించి పురుష పుంగవులకు దీటుగా అనేక రంగాల్లో రాణిస్తున్న నారీలోకానికి భారత సైనిక దళాల్లో కమాండ్‌ హోదాలకు, శాశ్వత కమిషన్‌కు రాచబాటలు పరుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంస్తుతిపాత్రమైనది! పోరాట విధుల్లోకి మహిళా అధికారుల్ని తీసుకోవడంపై నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేసిన న్యాయపాలిక- సైనిక దళాల్లో లింగ దుర్విచక్షణపై పద్నాలుగేళ్లుగా సాగుతున్న లిటిగేషన్లకు సతార్కిక ముగింపు పలికింది. జవాన్లలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చినవారు కావడంతో కమాండ్‌ హోదాలో మహిళా అధికారుల్ని ఆమోదించేందుకు వారు మానసికంగా ఇంకా సంసిద్ధం కాలేదని, స్త్రీ సహజ ప్రకృతి ధర్మాలు, కుటుంబపర బాధ్యతల నిర్వహణ వంటి వాటివల్ల మహిళా అధికారులు సైనిక విధుల్లోని సవాళ్లను అధిగమించలేరన్న కేంద్రం వాదనలను సుప్రీంకోర్టు అడ్డంగా కొట్టేసింది.

1995 నుంచే మొదలు

సైన్యంలోని పది విభాగాల్లో మహిళా పరిమిత కాల కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) అధికారులకు పూర్తి కాల కమిషన్‌ ఇవ్వడానికి నిరుడు ఫిబ్రవరిలో కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని సమర్థించిన న్యాయపాలిక- ఆ వెసులుబాటును అందరికీ వర్తింపజేయాలంటూ, వివిధ దేశాల్లో సైనిక విధుల్లో భారత మహిళాధికారుల అవిరళ సేవల్నీ ప్రస్తుతించింది. ఇజ్రాయెల్‌లో మహిళా సైనికులు 1995 నుంచే విస్తృత పోరాట విధుల్లో పాల్పంచుకొంటుంటే- 2001నుంచి జర్మనీ, 2013నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, 2018నుంచి బ్రిటన్‌ స్త్రీ శక్తితో సైన్యాన్ని సుసంపన్నం చేశాయి. కమాండ్‌ విధులకు సంబంధించి మహిళలన్న కారణంగా వారిని టోకున తోసిరాజనడం కుదరదని, అర్హతానర్హతల్ని గణించి అధికారులు నిర్ణయం తీసుకోవాలనడం ద్వారా సుప్రీం ద్విసభ్య బెంచ్‌- రాజ్యాంగం ప్రస్తావించిన సమన్యాయ సూత్రాలకు పట్టంగట్టింది. రేపటి సవాళ్లకు దీటుగా భారత సైన్యం నవీకరణ యత్నాలకు న్యాయపాలిక తీర్పు తలమానికం కానుంది!

ఆనాడే చెప్పిన రావత్​

పురుషులకే పరిమితమవుతూ వచ్చిన రణ క్షేత్రాన్ని నారీమణులకూ అందుబాటులోకి తీసుకురాదలచినట్లు భారత సైన్యాధిపతిగా జనరల్‌ బిపిన్‌ రావత్‌ 2017 జూన్‌లో ప్రకటించారు. తొలిదశలో మహిళలను మిలిటరీ పోలీసులుగా నియమించి, తరవాత యుద్ధ విద్యలు నేర్పించదలచినట్లూ వెల్లడించారు. త్రివిధ దళాల్లో మహిళల నియామకంపై ఏకీకృత విధాన రూపకల్పనకు కృషి చేస్తున్నట్లు 2018లో రక్షణ మంత్రిగా చెప్పిన నిర్మలా సీతారామన్‌- వాయు సేనలో మహిళలు పైలెట్లుగా పని చేస్తుండగా, నౌకాదళంలో స్త్రీలు సముద్రంపై వెళ్ళడానికే వీలు లేని వాతావరణాన్ని ప్రస్తావించారు. సైనిక బలగం రీత్యా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న ఇండియాకు- స్వీయ బలాధిక్యతను మెరుగుపరచుకొని దుర్నిరీక్ష్య శక్తిగా ఎదగడంలో అడుగులు తడబడుతున్నాయని చెప్పక తప్పదు!

పదేళ్ల న్యాయపోరాటం తర్వాత

కేంద్రం నోటిఫికేషన్‌ ద్వారా నిర్దేశించిన విభాగాల్లో తప్ప సైన్యంలోకి మహిళలు అనర్హులంటున్న 1950నాటి చట్టం- నాలుగు దశాబ్దాలపాటు మహిళలకు మిలిటరీ అవకాశాల్ని మూసేసింది. 1992లో తొలిసారి అయిదు విభాగాల్లోకి మహిళల్ని తీసుకొన్న కేంద్రం- స్త్రీలకు పూర్తి కాల కమిషన్‌ ఇవ్వాలంటూ 2010లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పదేళ్లపాటు న్యాయపోరాటం చేసింది. ‘సుప్రీం’ తాజా తీర్పుతో ఆ వివాదం సమసిపోగా, వచ్చే ఏడాది మార్చి నాటికి వందమంది మహిళా సైనికుల తొలి బృందం శిక్షణ ముగించుకొని మిలిటరీ పోలీస్‌ విధుల్లో చేరనుంది. కర్తవ్య దీక్ష పరంగా పురుషులకు ఏమాత్రం తీసిపోని స్త్రీలను సరైన శిక్షణతో కార్యదక్షులుగా తీర్చిదిద్దడంతోపాటు, కాలమాన పరిస్థితులు, భావి అవసరాలకు దీటుగా సమగ్ర సైనిక సంస్కరణలపైనా యుద్ధ ప్రాతిపదికన కదలడం తప్పనిసరి!

వచ్చే ఏడాది మార్చి నుంచి

త్రివిధ బలగాల మధ్య మెరుగైన సమన్వయ సాధనకోసం, పదాతి, వాయు, నౌకాదళాలకు సంబంధించిన అంశాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించగల మహాదళపతి పదవిని ఏర్పాటు చేయాలని సుబ్రహ్మణ్యం కమిటీ సూచించిన ఇరవయ్యేళ్లకు- ఈ మధ్యనే ఆ నియామకం పూర్తి అయింది. ఇదిగో అంటే, ఆ పని ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియని దురవస్థ, బడ్జెట్లో భీమ భాగం (రూ.3.37 లక్షల కోట్లు) కేటాయిస్తున్నా అధునాతన ఆయుధ పాటవం దక్కని దయనీయావస్థ చిరకాలంగా వర్ధిల్లుతున్నాయి. 11 పోరాట కమాండ్లతో అమెరికా, అయిదు థియేటర్‌ కమాండ్లతో చైనా రక్షణ పాటవాలకు సానపట్టిన నేపథ్యంలో- వచ్చే ఏడాదినుంచి అదే తరహా పోరాట వ్యూహాలకు పదును పెట్టాలని మహా దళపతి బిపిన్‌ రావత్‌ కొత్తగా ప్రతిపాదిస్తున్నారు. ఆదేశాలందడమే తరువాయి; త్రివిధ దళాల సిబ్బందీ కలగలిసిన కమాండ్‌ పని పూర్తి చేసి వచ్చేలా 2022 నాటికి పటిష్ఠ వ్యవస్థల కూర్పు ఒక కొలిక్కి వస్తుందంటున్నారు!

మార్పు రావాలి!

అందుకు తగ్గట్లుగా రక్షణ రంగం రాటుదేలాలంటే- ప్రధాని మోదీ 2015 డిసెంబరులో ఉద్బోధించినట్లు- సైనిక కమాండర్ల విశ్వాసాలు, విధానాలు, లక్ష్యాలు, వ్యూహాలు గుణాత్మకంగా మారాలి! చైనాలాంటి దేశాలూ బలగాల్ని తగ్గించుకొని సాంకేతిక శక్తితో బలపడుతుంటే- ఆ రెండింటి కోసమూ ఇండియాపడుతున్న ఆరాటం దేశ రక్షణను కుంగదీస్తోంది. మిలిటరీ బడ్జెట్లో 83శాతం దాకా జీతనాతాలకే వ్యయమైపోతుంటే, ఆధునికీకరణకు మిగులుతోంది 17శాతమే. వేరే పనుల్లో ఉన్న 57వేల మంది సైనికుల్ని తిరిగి రప్పించడం మొదలు మొన్న డిసెంబరు ఆఖరు నాటికి ఆధునికీకరణ లక్ష్యాలు సాధించాలన్నది ఏమేరకు నెరవేరిందీ సందేహమే! సుప్రీంకోర్టు చెప్పినట్లు- మూస ధోరణులు రూపుమాసిపోవాల్సిన తరుణమిది!

ఇదీ చదవండి: నమస్తే ట్రంప్​: యమునా నదిలోకి 500 క్యూసెక్కుల నీరు

Last Updated : Mar 1, 2020, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.