సాధారణంగా మనిషికి రెండు చేతులు, కాళ్లకు కలిపి 20 వేళ్లు ఉంటాయి. కొంతమందికి ఒకటో, రెండో ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఒడిశా గంజమ్ జిల్లాకు చెందిన కుమారి నాయక్‌కు మాత్రం అసాధారణ రీతిలో 31 వేళ్లు ఉన్నాయి. ఆమెను చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే. ఆమె చేతులకి 12 వేళ్లు... కాళ్లకి 19 వేళ్లున్నాయి.
ఆమె ప్రపంచంలోనే ఎక్కువ వేళ్లు ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించింది.
నాయక్ పాలిడాక్టలిజమ్ అనే జన్యుసంబంధిత లోపాల కారణంగా ఇలా అదనపు వేళ్లతో జన్మించింది. 75 ఏళ్ల నుంచి ఇలానే జీవనం సాగిస్తుంది.
ఇదీ చూడండి : మంచు దుప్పటిపై పరుగులు పెట్టిన గుర్రాలు