ETV Bharat / bharat

'పోలీసు సారూ.. రూ.2 వేలు అప్పు ఇవ్వండి ప్లీజ్​' - kerela poilce gave money

సాధారణంగా ఏదైనా సమస్య ఉంటే పోలీస్​ స్టేషన్​కు వెళ్తాం. కానీ కేరళ తిరువనంతపురంలో ఉండే ఓ కుటుంబం మాత్రం ఓ వినతి పత్రంతో పోలీస్ స్టేషన్​కు వెళ్లింది. ఆర్థిక కష్టాల్లో ఉన్నామని రూ. 2,000 సాయం చేయాలని కోరింది. మరి పోలీసులు సాయం చేశారా? లేదా? మీరే చదివేయండి.

kerela women
'పోలీసువారికి రాయునది.. రూ. 2వేల సాయం కోసం వినతి '
author img

By

Published : Jun 11, 2020, 12:06 PM IST

బిడ్డల ఆకలి తీర్చలేక, చదువు చెప్పించలేక ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఎలాగైనా తన బిడ్డల ఆకలి తీర్చాలనుకుంది. ఆలోచించింది. వెంటనే పెన్ను, పేపర్​ తీసుకుని డబ్బు సాయం చేయాలని పోలీసులకు వినతి పత్రం రాసింది.

ఇదీ జరిగింది..

కేరళ తిరువనంతపురం జిల్లా పాలోడ్​లో నివాసం ఉంటోంది శశికళ కుటుంబం. ఇంటికి పెద్దదిక్కైన భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఇళ్లల్లో పనిచేయడాన్ని వృత్తిగా చేసుకుని ఇద్దరు ఆడపిల్లలను పోషిస్తోంది శశికళ. లాక్​డౌన్​తో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల కనీసం పిల్లలకు తిండి పెట్టలేని స్థితిలో ఉంది ఆమె. ఈ నేపథ్యంలోనే రూ. 2,000 సాయం చేయాలని పాలోడ్​ పోలీసులకు లేఖ రాసింది.

letter
శశికళ రాసిన వినతి పత్రం

"గౌరవనీయులైన పోలీసులకు.. మేం పెరింగమాల పరిధిలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాం. నాకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి పన్నెండో తరగతి పరీక్షలు రాసింది. చిన్నకుమార్తె నాలుగో తరగతి చదువుతోంది. కనీసం పెద్దమ్మాయి టీసీని పాఠశాల నుంచి తీసుకోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. నాకు రూ. 2000 అప్పుగా ఇవ్వండి. ఇళ్లలో పనిచేసి మీ రుణాన్ని తీర్చుకుంటాను."

-శశికళ లేఖ

ఈ వినతిపై స్పందించిన పాలోడ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్​స్పెక్టర్ సతీశ్​కుమార్ వెంటనే కుటుంబానికి రూ.2000 సాయం అందించారు. అంతేకాక స్టేషన్​లోని పోలీసులంతా కలిసి శశికళ కుటుంబానికి నెలరోజులకు సరిపడా నిత్యవసర వస్తువులు అందించారు.

తనకు పెరింగమాల ప్రాంతం గురించి తెలియదని.. అందుకే ఎవరి సాయం కోరలేదని.. పోలీసులంటే ఉన్న నమ్మకం, గౌరవంతోనే వినతి పత్రం రాసినట్లు చెప్పుకొచ్చింది శశికళ.

ఇదీ చూడండి: 'ఐదేళ్లలో 29 శాతం పెరిగిన ఆసియా సింహాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.