కాంతమ్మ రోడ్డు పక్కన పూలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. కానీ, తన బతుకేదో తాను చూసుకునే మనిషి కాదు కాంతమ్మ. అందుకే, వర్షాలకు నీటమునిగిన ముంబయి రోడ్డుపై.. మూత తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో వాహనాలు పడిపోకుండా తనవంతు సాయం చేసింది. వానలో దాదాపు ఐదు గంటలపాటు నిలబడింది.
-
This video is from Tulsi Pipe Road in Matunga West, Mumbai. The lady seen in the video had been standing beside the open manhole for five hours to warn commuters driving on the road.
— The Better India (@thebetterindia) August 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
VC: Bhayander Gudipadva Utsav pic.twitter.com/FadyH175mY
">This video is from Tulsi Pipe Road in Matunga West, Mumbai. The lady seen in the video had been standing beside the open manhole for five hours to warn commuters driving on the road.
— The Better India (@thebetterindia) August 7, 2020
VC: Bhayander Gudipadva Utsav pic.twitter.com/FadyH175mYThis video is from Tulsi Pipe Road in Matunga West, Mumbai. The lady seen in the video had been standing beside the open manhole for five hours to warn commuters driving on the road.
— The Better India (@thebetterindia) August 7, 2020
VC: Bhayander Gudipadva Utsav pic.twitter.com/FadyH175mY
ఆగస్టు 4న భారీవర్షాలకు ముంబయి నగరం నీటమునిగింది. కాంతమ్మ పూలు అమ్ముతున్న రోడ్డుపై ఓ మురికికుంట మూత తెరిచి ఉంది. కానీ, నీళ్లు నిండిన రోడ్డుపై ఆ కుంట కనబడలేదు. దీంతో వాహనాలన్నీ అందులో పడి ప్రమాదానికి గురవుతున్నాయి. స్థానికులు బృహన్ ముంబయి కార్పొరేషన్‌కు ఫోన్ చేశారు. కానీ, కాంతమ్మ ఎవరో వస్తారు, ఏదో చేస్తారని వేచి చూడలేదు. ఆగకుండా వర్షం కురుస్తున్నా.. దాదాపు 5 గంటలపాటు ఆ కుంట పక్కన నిలబడి వాహనాలను పక్కకు మళ్లించింది.
"బంగ్లాల్లో ఉండేవారు మున్సిపాలిటి వాళ్లకు ఫోన్ చేశారు. కానీ, ఎంతకీ అధికారులు రాలేదు. వర్షంతో నా పూల వ్యాపారం ఎలాగో సాగదు. ఇతరులకైనా సాయం చేయాలనుకున్నాను. మూత తెరిచి ఉండటం వల్ల ఆ మురికికుంట దగ్గర బండ్లన్నీ కింద పడిపోతున్నాయి. అందుకే, అలా నిలబడి వాహనదారులను అప్రమత్తం చేశాను. రెండు మూడు గంటల తర్వాత రోడ్డుపై వెళ్తున్న ఓ మేడమ్ నాకు గొడుగు ఇచ్చింది. వర్షం తగ్గాక నేను ఇంటికెళ్లాను "
- కాంతమ్మ
కాంతమ్మ వర్షంలో తడుస్తూ గంటల తరబడి నిలబడిన దృశ్యాన్ని.. ద బెటర్ ఇండియా ట్విట్టర్ లో పంచుకుంది. కాంతమ్మ మానవత్వం ప్రదర్శించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. గంటల వ్యవధిలోనే ఆ వీడియో తెగవైరల్ అయిపోయింది.
ఇదీ చదవండి: తండ్రి ఆఖరి చూపు ఖరీదు రూ. 51,000/-..!