ETV Bharat / bharat

2 గంటల వ్యవధిలో యువతిపై ముగ్గురు అత్యాచారం - latest rape news

మహారాష్ట్రలో ఘోరం జరిగింది. సాయం కోసం అర్థించిన ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Woman raped by three men in separate incidents within 2 hrs
2 గంటల వ్యవధిలో యువతిపై ముగ్గురు అత్యాచారం
author img

By

Published : Feb 27, 2020, 9:27 AM IST

Updated : Mar 2, 2020, 5:29 PM IST

మహారాష్ట్రలో అమానుష ఘటన చోటు చేసుకుంది. సాయం అడిగిన ఓ యువతిని ముగ్గురు వ్యక్తులు రెండు గంటల్లో.. వేరువేరు ప్రదేశాల్లో అత్యాచారం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

అసలెలా జరిగింది..

ఫిబ్రవరి 18న సబర్బన్ ఘాట్కోపర్ రైల్వేస్టేషన్​లో తన బంధువులతో కలిసి వెళ్లాల్సిన యువతి.. రైలును సమయానికి అందుకోలేకపోయింది. అనంతరం వేరే రైలు​లో ముంబ్రా స్టేషన్​ చేరుకొని.. ఆ రాత్రికి అక్కడే నిద్రపోయింది.

ఫిబ్రవరి 19 ఉదయాన్నే మరో రైలెక్కి దివా స్టేషన్​ చేరుకుంది. అక్కడినుంచి వెళ్లడానికి డబ్బుల్లేక.. తన ముక్కుపుడకను అమ్మిపెట్టమని ఓ యాచకురాలిని అడిగింది. అయితే.. ఆ ప్రయత్నం విఫలం కాగా రింగ్​ను విక్రయించేందుకు గంటల పాటు ఆపసోపాలు పడిందా యువతి. ఇక ఏం చెయ్యాలో తెలియక అలా స్టేషన్​ చేరుకునేందుకు నడవడం ప్రారంభించింది.

సుమారు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తనను దగ్గర్లోని రైల్వే స్టేషన్​లో వదిలిపెట్టమని ఓ ఆటోడ్రైవర్​ను అడిగింది. అతను మహిళను నమ్మించి శిథిలావస్థలో ఉన్న ఓ భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తీసుకెళ్లి ఓ గుడి దగ్గర వదిలేశాడు.

మరో సారి కూడా..

అక్కడి నుంచి ఆ యువతి.. రాత్రి 10 గంటల సమయంలో బైక్​పై వెళ్తున్న ఇద్దరు యువకులను రైల్వే స్టేషన్​కు వెళ్లేందుకు సాయం చేయమని అడిగింది. నమ్మి వెళ్లిన మహిళ మరోసారి మోసపోయింది. ఆ దుర్మార్గులు యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.

Last Updated : Mar 2, 2020, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.