న్యాయ ప్రక్రియను నిరోధిస్తే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ పర్యటించేందుకు సిద్ధమని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో అత్యాచార బాధితులను పరామర్శించేందుకు రాహుల్ ఎందుకు వెళ్లడం లేదని భాజపా నేతలు చేసిన విమర్శలకు ఈ మేరకు స్పందించారు. రెండు రాష్ట్రాల్లో జరిగిన అత్యాచార ఘటనల్లో తమ ప్రభుత్వాలు న్యాయాన్ని అడ్డుకోలేదని అన్నారు.
-
Unlike in UP, the governments of Punjab and Rajasthan are NOT denying that the girl was raped, threatening her family and blocking the course of justice.
— Rahul Gandhi (@RahulGandhi) October 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
If they do, I will go there to fight for justice. #Hathras
">Unlike in UP, the governments of Punjab and Rajasthan are NOT denying that the girl was raped, threatening her family and blocking the course of justice.
— Rahul Gandhi (@RahulGandhi) October 24, 2020
If they do, I will go there to fight for justice. #HathrasUnlike in UP, the governments of Punjab and Rajasthan are NOT denying that the girl was raped, threatening her family and blocking the course of justice.
— Rahul Gandhi (@RahulGandhi) October 24, 2020
If they do, I will go there to fight for justice. #Hathras
"ఉత్తర్ప్రదేశ్లా కాకుండా పంజాబ్, రాజస్థాన్ ప్రభుత్వాలు బాధితులు అత్యాచారానికి గురైన విషయాన్ని ఖండించలేదు. బాధిత కుటుంబాన్ని బెదిరించడం, న్యాయ ప్రక్రియను అడ్డుకోవడం వంటివి చేయలేదు. ఒకవేళ అలా చేస్తే.. నేను అక్కడికి వెళ్లి న్యాయం కోసం పోరాడతాను."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
పంజాబ్, రాజస్థాన్లలో అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లలేదని రాహుల్ లక్ష్యంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జావడేకర్, హర్షవర్ధన్ విమర్శలు చేశారు. ఉత్తర్ప్రదేశ్ హాథ్రస్ అత్యాచార బాధితులను రాహుల్, ప్రియాంక గాంధీ పరామర్శించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి- 'ఆ రాష్ట్రాల్లో అత్యాచారాలపై కాంగ్రెస్ మౌనమేల?'