మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కారుకు కర్ణాటక తరహా ముప్పు పొంచి ఉందన్న ఊహాగానాల మధ్య... భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గీయ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోనూ భాజపా సరికొత్త ఆపరేషన్ చేపడుతుందని జైపుర్‌లో చెప్పారు.
"కర్ణాటకలో మంత్రిమండలి పని పూర్తి కానివ్వండి. తర్వాత కొత్త మిషన్ ప్రారంభం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం మా కోరిక కాదు. కాంగ్రెస్ విధానాల్లో ఆ రకమైన అనిశ్చితి ఉంది. వారి నాయకత్వంపై సభ్యులకు విశ్వాసం లేదు. వారు చేసిన తప్పులకు వారే బాధ పడుతున్నారు. అందుకే మోదీ ఉండడమే మంచిదని వారికి అనిపిస్తోంది. కాంగ్రెస్ చేసుకున్న కర్మల కారణంగానే ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. క్రికెట్ క్రీడలో బౌలర్ బౌలింగ్ చేస్తాడు, బ్యాట్స్‌మ్యాన్ బ్యాటింగ్ చేస్తాడు. ఒక్కోసారి హిట్ వికెట్ అయిపోతాడు. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ వికెట్ పడిపోతోంది."
-కైలాస్ విజయ్‌వర్గీయ, భాజపా ప్రధాన కార్యదర్శి