ETV Bharat / bharat

''చైనా పేరు'పై మోదీ సర్కారుకు భయమెందుకు?' - ahmed patel statement on modi speech

చైనా చొరబాట్లకు సంబంధించి ప్రధాని, రక్షణ మంత్రి మాటలకు పొంతన లేదని కాంగ్రెస్ ఆరోపించింది. చొరబాట్లు గతంలోనూ జరిగాయని, ప్రస్తుతం నిజాలు చెప్పేందుకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నించింది. కనీసం చైనా పేరు పలికేందుకు భయపడుతున్నారని విమర్శలు చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా.

Congress
కాంగ్రెస్
author img

By

Published : Aug 15, 2020, 2:01 PM IST

సరిహద్దుల్లో చొరబాట్లకు సంబంధించి అధికారంలో ఉన్న నేతలు చైనా పేరు పలికేందుకు ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. ప్రధాని నరేంద్రమోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"ప్రతి కాంగ్రెస్ కార్యకర్తతోపాటు 130 కోట్లమంది భారతీయులు మన సైన్యాన్ని చూసి గర్వపడుతున్నారు. వారిపై పూర్తి భరోసా ఉంచారు. చైనాకు దీటైన జవాబు ఇచ్చిన సైన్యానికి సెల్యూట్. కానీ, అధికారంలో ఉన్నవారు చైనా పేరు ప్రస్తావించడానికి ఎందుకు భయపడుతున్నారు? చైనాను వెనక్కు పంపేందుకు ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందో ప్రతి భారతీయుడు ఈరోజు ప్రశ్నించాలి."

- రణ్​దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

"ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందా? ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తుందా? దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉందా?" అని ప్రశ్నించారు సుర్జేవాలా. 'ఆత్మనిర్భర్​ భారత్​'ను నెహ్రూ, సర్దార్​ పటేల్​ ఎప్పుడో ప్రారంభించారని తెలిపారు. కానీ మన ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని ఆరోపించారు.

మోదీ ప్రసంగంపై పటేల్ విమర్శలు..

సరిహద్దుల్లో జరిగిన విషయాలను బయట పెట్టేందుకు ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ప్రశ్నించారు.

"సరిహద్దుల్లో ఏదైనా జరిగి ఉంటే చెప్పేందుకు ఇబ్బంది ఎందుకు? ఇంతకుముందు ఇలాంటివి జరిగాయి. ఒకవేళ వాళ్లు (చైనా) మన వైపు వస్తే వాటిపై దౌత్య, ఆర్థిక మార్గాల్లో ఒత్తిడి తెచ్చి వెనక్కు పంపాలి. చెప్పడం ఒకటే సరిపోదు. మనం దీటుగా జవాబిస్తే సంతోషమే. ప్రధాని చెప్పేది నమ్మాలి. కానీ వాస్తవ పరిస్థితులను వారు మర్చిపోకూడదు. ప్రధాని ప్రకటనలకు, రక్షణ మంత్రి మాటలకు పొంతన లేదు."

- అహ్మద్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ నేత

ఎర్రకోట ప్రసంగంలో మోదీ..

స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగించిన ప్రధాని మోదీ.. దేశ సరిహద్దులో చొరబాట్లకు పాల్పడేవారికి దీటైన జవాబిస్తామని హెచ్చరించారు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే లద్దాఖ్​లో జరిగిన గుణపాఠమే ఎదురవుతుందని అన్నారు. భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచం అండగా నిలబడుతోందని... ఇదే దేశ నైతికతకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'సరిహద్దు దాటితే గుణపాఠమే- లద్దాఖ్ ఘటనే సాక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.