ETV Bharat / bharat

మసాజ్​ సౌకర్యంపై వెనక్కి తగ్గిన రైల్వే శాఖ - రైల్వే

రైల్వే ప్రయాణికులకు మసాజ్​ సౌకర్యం కల్పించటంపై రైల్వే శాఖ వెనక్కి తగ్గింది. పశ్చిమ రైల్వే జోన్​ పరిధిలోని ఇండోర్​ నుంచి ప్రారంభమయ్యే 39 రైళ్లలో ఈ సేవలు అందించాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

మసాజ్​ సేవలపై వెనక్కి తగ్గిన రైల్వే శాఖ
author img

By

Published : Jun 15, 2019, 11:44 PM IST

Updated : Jun 16, 2019, 12:44 AM IST

రైళ్లలో ప్రయాణికులకు మసాజ్​ సౌకర్యం కల్పించాలన్న ప్రతిపాదనపై రైల్వేశాఖ వెనక్కి తగ్గింది. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు పశ్చిమ రైల్వే అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్​లోని ఇండోర్​ నుంచి ప్రారంభమయ్యే 39 రైళ్లలో ఈ సేవలు అందించాలని ఇటీవలే రైల్వే ప్రతిపాదించింది.

" పశ్చిమ రైల్వే రత్లామ్​ డివిజన్​ పరిధిలోని ఇండోర్​ స్టేషన్​ నుంచి బయలుదేరే రైళ్లలో తల, కాళ్ల మసాజ్​ సేవలను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన పశ్చిమ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిన వెంటనే.. మసాజ్​ సౌకర్యాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు."

- రవీందర్​ భకర్​, పశ్చిమ రైల్వే ప్రతినిధి

రైళ్లలో మసాజ్​ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఎంపీ శంకర్​ లాల్వానీ, లోక్​సభ మాజీ స్పీకర్​ సుమిత్రా మహజన్​ వ్యతిరేకించారు. ఇలాంటి సేవల వల్ల ప్రయాణికులు, ముఖ్యంగా మహిళల భద్రత, సౌకర్యాల అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు.

రైల్వే మంత్రికి లేఖ

ఈ విషయంపై ఈ నెల 10న రైల్వే శాఖ మంత్రికి భాజపా ఎంపీ లాల్వానీ లేఖ రాశారు. రైళ్లలో ప్రయాణికులకు మసాజ్​ సౌకర్యాలు కల్పించటం సముచితం కాదని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు ఉన్న సమయంలో అలాంటివి చేయటం సరికాదన్నారు. ప్రయాణికులకు వైద్య సదుపాయాలు, వైద్యులను అందుబాటులో ఉంచటం వంటి సేవలకు బదులు ఇలాంటి విలువ లేని సేవలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: 'కరవుపై సమీక్ష-వ్యవసాయంలో నిర్మాణాత్మక సంస్కరణ'

AP Video Delivery Log - 1600 GMT News
Saturday, 15 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1559: Peru Venezuela Migrants AP Clients Only 4216037
Peru begins requesting visas from Venezuelans
AP-APTN-1533: Syria Aftermath Must credit Syrian Civil Defence Idlib 4216030
Dozens dead in violence in Syria's Idlib province
AP-APTN-1510: Poland Plane Crash No access Poland 4216035
German stunt pilot killed during airshow in Poland
AP-APTN-1451: UK Hunt AP Clients Only 4216031
UK's Hunt on Gulf tension, Zaghari-Ratcliffe, HK
AP-APTN-1406: UK Iran Hunger Strike No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4216029
British-Iranian woman on hunger strike in Iran
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 16, 2019, 12:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.