దిల్లీలోని యమునా నదికి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎగువ ఉన్న హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటమే ఇందుకు కారణం.
యమునా నది నీటి మట్టం సోమవారం ప్రమాదస్థాయిని దాటింది. హత్నికుండ్ బ్యారేజ్ నుంచి ఆదివారం నీటిని విడుదల చేయడం వల్ల ఈరోజు ఉదయం యమునా నదిలో నీటిమట్టం 204.70 మీటర్లుగా నమోదయింది.
ప్రభుత్వ చర్యలు...
హత్నికుండ్కు సమీపంలోని యమునా నది పరివాహక ప్రాంతమైన కాంచన్‌బాగ్ కాలనీని పూర్తిగా ఖాళీ చేయించారు అధికారులు. ఓక్లా ప్రాంతంలోని కెనాల్ నగర్వాసులనూ ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో సుమారు 100 కుటుంబాలున్నాయి. పురాణా దిల్లీలోని ఐరన్ బ్రిడ్జ్‌పై రాకపోకలను నిలిపివేశారు.
వరద నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి:- డ్రగ్స్ వద్దన్నాడని.. తండ్రినే హతమార్చిన తనయ!