ETV Bharat / bharat

పల్లెటూళ్లకు సత్వర న్యాయం.. గ్రామ న్యాయాలయం

మహాత్మా గాంధీ 1920-21 సహాయ నిరాకరణోద్యమ సమయంలో దేశ ప్రజలు బ్రిటిష్‌ న్యాయస్థానాలను బహిష్కరించాలని, న్యాయం కోసం గ్రామ పంచాయతీలను ఆశ్రయించాలని పిలుపు ఇచ్చారు. గ్రామ పంచాయతీల పునాది లేకుండా అచ్చమైన ప్రజాస్వామ్య పాలనను సాధించలేమని ఆచార్య ఎన్‌.జి.రంగా ఉద్ఘాటించారు. ఈ వాస్తవాలను గుర్తించి 2009లో న్యాయపంచాయతీ బిల్లు ముసాయిదాను రూపొందించారు. గ్రామాల్లో వివాదాలను ప్రజల భాగస్వామ్యంతో శీఘ్రంగా, నిష్పాక్షికంగా పరిష్కరించడానికి న్యాయ పంచాయతీలు తోడ్పడాలని ఆశించిన ఆ బిల్లు చట్టరూపం ధరించలేకపోయింది.

author img

By

Published : Mar 28, 2020, 7:49 AM IST

village-courts-for-for-quick-justice
పల్లెటూళ్లకు సత్వర న్యాయం.. పేదల కోసం గ్రామ న్యాయాలయం

అందరికీ సమన్యాయం అందాలని రాజ్యాంగం, ఆదేశిక సూత్రాలు ఘోషిస్తున్నాయి. 21వ అధికరణ హామీ ఇస్తున్న జీవించే హక్కులో న్యాయం పొందే హక్కు అంతర్భాగమని రాజ్యాంగ ధర్మాసనాలు స్పష్టీకరించాయి. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన ప్రాచీన కాలం నుంచే ఉంది. అది ఈ నేల స్వభావంలోనే ఇమిడిపోయింది. స్థానిక స్వపరిపాలన పంచాయతీలతోనే మొదలవుతుంది. పంచాయతీలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. స్థానిక వివాదాల్లో ప్రజలకు న్యాయం అందించడం పంచాయతీల విధుల్లో అతి ముఖ్యమైనది. రహదారులు, కమ్యూనికేషన్‌ సౌకర్యాలు లేని పూర్వ కాలంలో గ్రామాలు బాహ్య శక్తుల ప్రాబల్యం లేకుండా స్వావలంబనతో ముందుకుసాగేవి. దీన్నే గ్రామ స్వరాజ్యంగా వర్ణించారు. ప్రాచీన స్మృతి సాహిత్యంలో కుల, శ్రేణి, పుగ అనే గ్రామ సంస్థల గురించి ప్రస్తావన ఉంది. గ్రామాల్లో వివాదాలను బహిరంగ న్యాయ పంచాయతీలు పరిష్కరించేవి. వాటిలో గ్రామ ప్రజలంతా పాలుపంచుకునేవారు. బ్రిటిష్‌ వలస పాలన మొదలయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సంప్రదాయ న్యాయ వ్యవస్థలు విచ్ఛిన్నమై బ్రిటిష్‌ వారి న్యాయ స్మృతి అమలులోకి వచ్చింది.

జీవించే హక్కులో అంతర్భాగం

మహాత్మా గాంధీ 1920-21 సహాయ నిరాకరణోద్యమ సమయంలో దేశ ప్రజలు బ్రిటిష్‌ న్యాయస్థానాలను బహిష్కరించాలని, న్యాయం కోసం గ్రామ పంచాయతీలను ఆశ్రయించాలని పిలుపు ఇచ్చారు. గ్రామ పంచాయతీల పునాది లేకుండా అచ్చమైన ప్రజాస్వామ్య పాలనను సాధించలేమని ఆచార్య ఎన్‌.జి.రంగా ఉద్ఘాటించారు. ఈ వాస్తవాలను గుర్తించి 2009లో న్యాయపంచాయతీ బిల్లు ముసాయిదాను రూపొందించారు. ఒక గ్రామ పంచాయతీకి కానీ, కొన్ని పంచాయతీల సముదాయానికి కానీ న్యాయ పంచాయతీని ఏర్పరచాలని ఆ ముసాయిదా బిల్లు ఉద్దేశించింది. గ్రామాల్లో వివాదాలను ప్రజల భాగస్వామ్యంతో శీఘ్రంగా, నిష్పాక్షికంగా పరిష్కరించడానికి న్యాయ పంచాయతీలు తోడ్పడాలని ఆశించిన ఆ బిల్లు చట్టరూపం ధరించలేకపోయింది. అంతకుముందు, అంటే 2008లో భారత పార్లమెంటు ఆమోదించిన గ్రామ న్యాయాలయాల చట్టం 2009 అక్టోబరు రెండో తేదీ మహాత్మాగాంధీ జన్మదినంనాడు అమలులోకి వచ్చింది. గ్రామాల్లో ప్రజల ముంగిట్లోకే శీఘ్రంగా, పెద్ద ఖర్చు లేకుండా న్యాయాన్ని అందించడానికి ఉద్దేశించిన చట్టమది. దీనికింద దేశమంతటా 5,000 గ్రామ న్యాయాలయాలను నెలకొల్పదలిచారు. 1986లోనే లా కమిషన్‌ గ్రామ న్యాయాలయాల ప్రతిపాదనను తీసుకొచ్చింది. కోర్టులు, ఫోరంలు, ట్రైబ్యునళ్లు, వివాద పరిష్కార కేంద్రాలను నిరాటంకంగా ఆశ్రయించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పరచాలని లా కమిషన్‌ 114వ నివేదిక సూచించింది. దేశ ప్రజలకు 21వ రాజ్యాంగ అధికరణ భరోసా ఇస్తున్న జీవించే హక్కులో సులువుగా న్యాయం పొందే వెసులుబాటు అంతర్భాగమని లా కమిషన్‌ నివేదికలు, అనేకానేక తీర్పులు ధ్రువీకరించాయి. సత్వర న్యాయం కోసం పార్లమెంటు అనేక ప్రగతిశీల చట్టాలు చేసింది. అవి- 1984 కుటుంబ న్యాయ స్థానాల చట్టం, 1986 వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం, 1987 న్యాయ సేవల ప్రాధికార సంస్థల చట్టం, 2008 గ్రామ న్యాయాలయాల చట్టం, వ్యాజ్యందారులు ఆశ్రయించడానికి గ్రామ న్యాయాలయాలకు తోడు, లోక్‌ అదాలత్‌, మధ్యవర్తిత్వం, రాజీ కేంద్రాలు, ఎలెక్ట్రానిక్‌ కోర్టు ప్రక్రియలను అందుబాటులోకి తెచ్చారు. గ్రామ న్యాయాలయాల చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులను సంప్రదించిన మీదట ప్రతి పంచాయతీకి ఒకటీ లేక అంతకుమించి న్యాయాలయాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ప్రతి గ్రామ న్యాయాలయం పరిధిని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా ప్రకటించాలి. ఇతర చట్టాల కింద నెలకొల్పిన కోర్టులకు తోడుగా అవి పనిచేస్తాయి.

5వేల గ్రామాలు లక్ష్యంగా..

గ్రామ న్యాయాలయాల చట్టం 2009 అక్టోబరు రెండో తేదీన అమలులోకి వచ్చినప్పటికీ ఆశించిన పురోగతి లేకపోవడం విచారకరం. ఈ చట్టం కింద దేశమంతటా అయిదు వేల గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయాలని తలపెట్టినా చివరకు 194 న్యాయాలయాలను మాత్రమే నెలకొల్పగలిగారు. ఇందుకు నిధుల కొరతతోపాటు, ప్రభుత్వం చొరవ తీసుకోకుండా ఉదాసీనత ప్రదర్శించడం ప్రధాన కారణాలు. అనేక రాష్ట్రాలు గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు నోటిఫికేషన్లు కూడా జారీ చేయలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ నాయకత్వంలోని ధర్మాసనం- న్యాయాలయాలను ఎందుకు ఏర్పాటు చేయలేదో తెలుపుతూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ ఏడాది జనవరి 29న రాష్ట్రాలను ఆదేశించింది. ఏయే రాష్ట్రాల్లో గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయలేదో అక్కడి ప్రభుత్వాలతో ఆయా రాష్ట్రాల హైకోర్టులు సత్వరం సంప్రదింపులు ప్రారంభించాలని కూడా సూచించింది. వెంటనే గ్రామ న్యాయాలయాల ఏర్పాటు, వాటిలో నియామకాలకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి చర్యలు తీసుకోవాలన్నది. తన ఆదేశాలను తక్షణం స్పీడ్‌ పోస్ట్‌, ఈమెయిల్‌ ద్వారా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు పంపాలన్నది. మొత్తంమీద గ్రామ న్యాయాలయాలకూ గ్రామ న్యాయ పంచాయతీలకూ విస్పష్టమైన తేడా ఉంది. న్యాయాలయాలంటే వికేంద్రీకృత న్యాయస్థానాలు. న్యాయ వ్యవస్థ సభ్యులు వాటికి సారథ్యం వహిస్తారు. సువ్యవస్థిత చట్టాలు, న్యాయ సూత్రాల ఆధారంగా కేసులను పరిష్కరించిన అనుభవం వారి సొంతం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గ్రామీణ ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే న్యాయ సంస్థల ఏర్పాటుకు అన్వేషణ సాగుతూనే ఉంది. అందరికీ ఆమోదనీయమైన సంస్థలతో న్యాయం జరిగేలా చూడాలని ఆకాంక్షించారు. బ్రిటిష్‌ వలస పాలనకు ముందున్న సంప్రదాయ, స్వదేశీ వివాద పరిష్కార యంత్రాంగాలను పునరుజ్జీవింపజేయాలని పదేపదే పిలుపు ఇచ్చేవారు. తదనుగుణంగా గ్రామీణ పేదలకు న్యాయం చేకూర్చే దిశగా పడిన పెద్ద ముందడుగు- గ్రామ న్యాయాలయాలు. ఇవి సాధారణ కోర్టుల మాదిరిగానే ప్రజలకు న్యాయం అందిస్తాయి. గ్రామ న్యాయ పంచాయతీల బదులు గ్రామ న్యాయాలయాలను చేపట్టడం ద్వారా ప్రభుత్వం సంప్రదాయ వివాద పరిష్కార ప్రక్రియను పునరుద్ధరిస్తోంది. న్యాయ స్థానాల వ్యవస్థను ప్రాథమిక స్థాయికీ విస్తరిస్తోంది. గ్రామీణులకు వేగంగా, సులువుగా న్యాయం జరిగేలా చూడటానికి గ్రామ న్యాయాలయాల పరిధిని విస్తరించవచ్చు. ఇందుకోసం గ్రామ న్యాయాలయాల చట్టంలో అవసరమైన మార్పుచేర్పులు చేసే అధికారం కేంద్ర రాష్ట్రాలకు ఉంటుంది. ఈ చట్టంలోని లక్ష్యాలను నెరవేర్చడానికి గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీచేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

గ్రామ న్యాయలయానికి సారథ్యం వహించే న్యాయాధికారికి హైకోర్టు కింద పనిచేసే ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ హోదా, అధికారాలు ఉంటాయి. ఉభయులకూ సమాన అర్హతలు ఉంటాయి కాబట్టి, సమాన వేతనాలు లభిస్తాయి. న్యాయాధికారి సంచార న్యాయస్థానం మాదిరిగా వ్యవహరిస్తారని గ్రామ న్యాయాలయాల చట్టం పేర్కొంటోంది. తన పరిధిలోకి వచ్చే గ్రామాలను నిర్దిష్ట కాలంలో సందర్శిస్తూ విచారణలు జరుపుతారు. వ్యాజ్యదారులకు లేదా వివాదం తలెత్తిన ప్రదేశానికి సమీపంలో విచారణ జరిపి, పరిష్కరిస్తారు. గ్రామ న్యాయాలయం ఏక కాలంలో సంచార న్యాయస్థానంగా, సివిల్‌, క్రిమినల్‌ కోర్టుల మాదిరిగా పనిచేస్తుంది. గ్రామ న్యాయాలయ చట్టంలోని మొదటి, రెండవ షెడ్యూళ్లలో పేర్కొన్న సివిల్‌, క్రిమినల్‌ కేసులు, దావాలు, క్లెయిములు లేదా వివాదాలను పరిష్కరిస్తుంది. ఈ రెండు షెడ్యూళ్లను సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. సివిల్‌ కోర్టుల అధికారాలే కొద్ది మార్పుచేర్పులతో న్యాయాలయాలకూ ఉంటాయి. వాటిని చట్టంలో నిర్దేశించిన పద్ధతిలో వినియోగించాలి.

గ్రామ న్యాయాలయాలు సాధ్యమైనంత వరకు వ్యాజ్యదారుల మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించాలి. దీనికోసం ప్రత్యేకంగా మద్యవర్తులను నియమించాలి. చట్టంలోని మొదటి షెడ్యూలులో భారత శిక్షాస్మృతి (ఐపీసీ) కిందకు వచ్చే కొన్ని నేరాలను, కొన్ని కేంద్ర చట్టాల కింద పేర్కొన్న నేరాలను నోటిఫై చేశారు. ఇవి కాకుండా రాష్ట్రాలు తమ విచక్షణానుసారం మరికొన్ని నేరాలను ఉటంకించవచ్చు. రాష్ట్ర చట్టాల కింద మినహాయింపులు ఇవ్వచ్చు. ఈ చట్టంలోని రెండో షెడ్యూలు కేంద్ర, రాష్ట్ర చట్టాల కింద గ్రామ న్యాయాలయాల విచారణ పరిధిని పెంచే అధికారమిస్తోంది. గ్రామ న్యాయాలయం చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి కావలసిన నియమనిబంధనలను చేసే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు, హైకోర్టులకు కట్టబెట్టారు. న్యాయాలయాల పనితీరును తనిఖీ చేసే అధికారం హైకోర్టుకు ఉంటుంది. గ్రామ న్యాయాలయ విచారణాధికారాలను పకడ్బందీగా అమలుచేయడానికి దాని పరిధిలోకి వచ్చే పోలీసు అధికారి అన్ని విధాలా తోడ్పడాల్సి ఉంటుంది. రుణ, ధన లావాదేవీలను వేగంగా పరిష్కరించడానికి గ్రామ న్యాయాలయాలు ‘సమ్మరీ ప్రొసీజర్‌’ను అనుసరించవచ్చు. 1872 భారతీయ సాక్ష్యాధారాల చట్టం నిర్దేశించిన నియమనిబంధనలకు బద్దులు కానక్కర్లేదు. సహజ న్యాయ సూత్రాలనూ, హైకోర్టులు విధించిన నియమాలనూ పాటిస్తూ వివాదాలకు పరిష్కారం చూపాలి. నిందితుడు విచారణకు ముందు ప్రాసిక్యూషన్‌తో మాట్లాడుకుని నేరం ఒప్పుకుని కొన్ని మినహాయింపులు పొందడానికి గ్రామ న్యాయాలయాలు వీలు కల్పిస్తాయి. సీఆర్పీసీ చట్టంలోని 21-ఎ అధ్యాయం కింద లభించే ఈ వెసులుబాటును గ్రామ న్యాయాలయాలు ఉపయోగించవచ్చు. క్రిమినల్‌ కేసుల్లో న్యాయాలయాల తీర్పుపై సెషన్స్‌ కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. దాన్ని ఆరు నెలల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. సివిల్‌ కేసుల్లో జిల్లా కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. దాన్ని కూడా ఆరు నెలల్లోనే పరిష్కరించాలి.

- అంబటి సుధాకరరావు(న్యాయవాది)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.