భూమి మీదనున్న వేలాది అద్భుత ప్రకృతి దృశ్యాలను... అంతరిక్షం నుంచి చూస్తే ఎలా ఉంటాయో 'గూగుల్ ఎర్త్ వ్యూ' కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఆ విధంగా చూడవచ్చు. అయితే ఈ సెర్చింజన్ దిగ్గజం ఇటీవలే తన సంకలనానికి మరో వెయ్యి కొత్త చిత్రాలను జతచేసింది. దీంతో 'బర్డ్-ఐ వ్యూ' ద్వారా ఏడు ఖండాల్లో.. మనం చూడగలిగే అద్భుత దృశ్యాల సంఖ్య 2,500 కి చేరింది.
35 భారత్ దృశ్యాలు...
గూగుల్ ఎర్త్ వ్యూలో మన దేశానికి చెందిన 35 ప్రాంతాల వివరాలు కూడా చోటు దక్కించుకున్నాయి. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలోని వివిధ ప్రదేశాలు హైరిజల్యూషన్ శాటిలైట్ చిత్రాల రూపంలో దర్శనమివ్వనున్నాయి.
''మనల్ని చిన్న స్క్రీన్ల ముందు నుంచి అంతరిక్షానికి తీసుకుపోగల శక్తి గూగుల్ ఎర్త్‌కి ఉంది. గత పది సంవత్సరాలలో మా కలెక్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా లక్షాలాదిమంది చూశారు. తమ వాల్‌పేపర్లు, స్క్రీన్ సేవర్లుగా పెట్టుకున్నారు. ఇప్పుడు మేము మా ఎర్త్ వ్యూ సేకరణకు మరో వెయ్యికి పైగా చిత్రాలను జతచేయటం ద్వారా దానిని నవీకరించాం.''
-గోపాల్ షా, గూగుల్ ఎర్త్ ప్రొడక్ట్ మేనేజర్
-
📷Camera traps snap a series of photos whenever an animal walks by.
— Google Earth (@googleearth) December 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
🦓Researchers use images to learn more about specific species.
💻The Wildlife Insights Platform uses AI to identify species.
Learn more about Wildlife Insights: https://t.co/XwtNWFQWKU pic.twitter.com/fpjKWoh48m
">📷Camera traps snap a series of photos whenever an animal walks by.
— Google Earth (@googleearth) December 17, 2019
🦓Researchers use images to learn more about specific species.
💻The Wildlife Insights Platform uses AI to identify species.
Learn more about Wildlife Insights: https://t.co/XwtNWFQWKU pic.twitter.com/fpjKWoh48m📷Camera traps snap a series of photos whenever an animal walks by.
— Google Earth (@googleearth) December 17, 2019
🦓Researchers use images to learn more about specific species.
💻The Wildlife Insights Platform uses AI to identify species.
Learn more about Wildlife Insights: https://t.co/XwtNWFQWKU pic.twitter.com/fpjKWoh48m
ఇదీ చూడండి: 'మసూద్ అజార్‌ను పాక్ సురక్షితంగా దాచిపెట్టింది'