ఉత్తరాఖండ్ ఉధమ్ సింగ్ నగర్ జిల్లా.. రుద్రపుర్‌లో దెయ్యాలు సంచరిస్తున్నట్లు ఓ వీడియో, ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓ షాపింగ్‌మాల్‌లోని పార్కింగ్ ప్రాంగణంలో నిచ్చెన దానంతట అదే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోతో పాటు దెయ్యాలు సంచరిస్తున్నట్లు మరో ఫొటో కూడా ఉంది.
సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టిన ఈ దృశ్యాలు.. తిరిగి తిరిగి చివరకు మాల్ యాజమాన్యం కంటపడ్డాయి. వీడియో చూసిన వారంతా మొదట కంగు తిన్నారు. అయితే.. అలాంటివి ఏమీ లేవంటూ వదంతులు ప్రచారం చేసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

షాపింగ్‌మాల్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఎవరో ఇలా మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారని పేర్కొన్నారు మాల్ సిబ్బంది. ఆ వీడియో, ఫోటో ఎడిటింగ్ చేసినట్లు స్పష్టంగా తెలిసిపోతోందన్నారు.

ఇదీ చదవండి:ఏడు పదుల వయసులోనూ హేమ మాలిని నాట్యం భళా