ETV Bharat / bharat

'బిలియనీర్లకు ఎర్రతివాచీలు.. రైతులకు గోతులా?' - ప్రియాంకా గాంధీ తాజా వార్తలు

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. దిల్లీలో రైతులు చేస్తోన్న ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. దిల్లీ సరిహద్దులో అన్నదాతలను అడ్డుకునే క్రమంలో ఓ రైతుపై పోలీసు లాఠీ ఎత్తాడు. ఈ ఫొటోలిప్పుడు సోషల్​ మీడియాలో వైరలవ్వగా.. దీనిపై కాంగ్రెస్​ అగ్రనేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు.

very-sad-incidents-rahul-and-priyanka-responds-on-farmers-agitation-in-delhi
'బిలియనీర్లకు ఎర్రతివాచీలు.. రైతులకు గోతులా?'
author img

By

Published : Nov 28, 2020, 2:19 PM IST

దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు సంబంధించిన పలు చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రైతులను నిలువరించే క్రమంలో ఓ రైతుపై పోలీసు లాఠీ లేపిన ఫొటో ఒకటి పలువురి దృష్టిని ఆకర్షించింది. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఆ సంఘటన తనని తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • बड़ी ही दुखद फ़ोटो है। हमारा नारा तो ‘जय जवान जय किसान’ का था लेकिन आज PM मोदी के अहंकार ने जवान को किसान के ख़िलाफ़ खड़ा कर दिया।

    यह बहुत ख़तरनाक है। pic.twitter.com/1pArTEECsU

    — Rahul Gandhi (@RahulGandhi) November 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"బాధాకరమైన చిత్రం: జై జవాన్‌.. జై కిసాన్‌ అన్నది మన నినాదం. కానీ.. ఈరోజు ప్రధాని మోదీ అహంకారం వల్ల రైతులకు జవాన్లు వ్యతిరేకంగా నిలబడాల్సి వస్తోంది. ఇది చాలా ప్రమాదకరం."

- రాహుల్‌ ట్వీట్‌

రైతుల ఆందోళనలకు సంబంధించిన పలు చిత్రాలను షేర్‌ చేసిన కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బడా కార్పొరేట్లకు ఎర్రతివాచీలతో స్వాగతం పలికే మోదీ సర్కార్‌.. రైతులు వస్తే మాత్రం రోడ్లపై గోతులు తవ్వుతున్నారని విమర్శించారు.

  • भाजपा सरकार में देश की व्यवस्था को देखिए

    जब भाजपा के खरबपति मित्र दिल्ली आते हैं तो उनके लिए लाल कालीन डाली जाती है।

    मगर किसानों के लिए दिल्ली आने के रास्ते खोदे जा रहे हैं।

    दिल्ली किसानों के खिलाफ कानून बनाए वह ठीक, मगर सरकार को अपनी बात सुनाने किसान दिल्ली आए तो वह गलत? pic.twitter.com/rm7CFmaWAL

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"భాజపా సర్కార్‌ ఆధ్వర్యంలో దేశంలో వ్యవస్థలు ఎలా తయారయ్యాయో చూడండి. భాజపాకు చెందిన బిలియనీర్‌ మిత్రులు దిల్లీకి వస్తే వారికి ఎర్రతివాచీలతో స్వాగతం పలుకుతారు. రైతులు వస్తే మాత్రం రోడ్లపై గుంతలు తవ్వుతున్నారు. రైతు వ్యతిరేక చట్టాలు చేయడం సరైనదేనట. కానీ, వాటిని నిరసిస్తూ దిల్లీకి రావడం మాత్రం తప్పా?"

- ప్రియాంక గాంధీ ట్వీట్​

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు రోజులుగా రైతులు చేస్తున్న నిరసన శనివారమూ కొనసాగుతోంది. నిరంకారీ మైదానంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ.. రైతులు మాత్రం దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బలగాల్ని భారీగా మోహరించారు. నేడు మరికొంత మంది రైతులు ఈ ఆందోళనల్లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

very-sad-incidents-rahul-and-priyanka-responds-on-farmers-agitation-in-delhi
రైతుపై లాఠీ ఎత్తిన చిత్రాలు

ఇదీ చదవండి: 'బలవంతం చేస్తే సుదర్శన చక్రం ప్రయోగిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.