ETV Bharat / bharat

ఆస్పత్రిలో చేరిన ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి

ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్​ దేహ్రాదూన్​లోని ఆస్పత్రిలో చేరారు. ఆయనకు డిసెంబర్​ 18న కరోనా సోకగా.. ఇప్పుడు చికిత్స కోసం వెళ్లినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

author img

By

Published : Dec 28, 2020, 5:35 AM IST

కరోనా బారిన పడిన ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్​ ఆదివారం.. ఆస్పత్రిలో చేరారు. వైద్యుల సూచనల మేరకు.. దేహ్రాదూన్​లోని దూన్​ ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.

డిసెంబర్​ 18న రావత్​కు కరోనా సోకింది. అనంతరం.. కొన్ని రోజుల పాటు స్వీయ ఏకాంతంలో ఉన్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. ఉత్తరాఖండ్​లో ప్రస్తుతం 5,444 కొవిడ్ యాక్టివ్​​ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1476 మంది మరణించారు.

ఇదీ చూడండి: 2021లో రెండు సార్లు సూర్య, చంద్ర గ్రహణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.