ETV Bharat / bharat

కుల ఘర్షణలకు కుట్ర! హాథ్రస్ ఘటనపై 19 కేసులు

author img

By

Published : Oct 6, 2020, 4:39 AM IST

హాథ్రస్ ఘటనకు సంబంధించి 19మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్ని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని అభియోగాలు మోపారు. కుల, మత ఘర్షణలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.

up police filed 19 cases related to hathras incident
కుల ఘర్షణలకు కుట్ర! హాథ్రస్ ఘటనపై 19 కేసులు

హాథ్రస్‌ అత్యాచార ఘటనకు సంబంధించి 19 మంది గుర్తు తెలియని వ్యక్తులపై యూపీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనను తప్పుదోవ పట్టించేలా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఈ కేసులు నమోదు చేశారు. దేశ ద్రోహం, కుట్ర కోణం, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద ఈ కేసులు నమోదయ్యాయి.

తమ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాల్జేయడం, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక్కడి చందా పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసులు నమోదు చేశారు. హాథ్రస్‌ కేసు విషయంలో యూపీ ప్రభుత్వ ప్రకటనలను మార్చి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తున్న వారిపై ఈ కేసులు నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఐపీసీతో పాటు ఐటీ చట్టాల కింద ఈ కేసులు నమోదు చేశారు.

బాధిత కుటుంబానికి భారీ మొత్తంలో నగదు ఆశ చూపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీవీ ఛానెల్​కు చెప్పించేలా చేశారని ఓ పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు నమోదు చేసిన అభియోగాల ఆధారంగా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) రంగంలోకి దిగనుంది. నగదు అక్రమ చలామణి కింద చర్యలు చేపట్టనున్నట్లు ఈడీ జాయింట్ డైరెక్టర్​(లఖ్​నవూ జోన్​) రాజేశ్వర్ సింగ్ తెలిపారు.

24 గంటల భద్రత..

హాథ్రస్‌ అత్యాచార ఘటనలో బాధితురాలి కుటుంబానికి యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. బాధిత కుటుంబం ఇంటి చుట్టూ పహారా కాయడమే కాక, కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు రక్షణగా ఉన్నారని యూపీ హోంశాఖ అధికారులు వెల్లడించారు.

మొత్తం 12 నుంచి 15 మంది కానిస్టేబుళ్లు 24 గంటల పాటు కుటుంబానికి భద్రత కల్పిస్తున్నారన్నారు. బాధితురాలి సోదరుడి వెంట ఇద్దరు కానిస్టేబుళ్లు తోడుంటారని హాథ్రస్‌ పోలీసులు తెలిపారు. కానిస్టేబుళ్లతో పాటు ముగ్గురు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు, డీఎస్పీ ర్యాంక్‌ అధికారి ఒకరు బందోబస్తు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ బృందంలో మహిళా పోలీసులు సైతం సైతం 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. హాథ్రస్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు మేజిస్ట్రేట్‌లుకు కూడా అందుబాటులో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.