ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌లో జరిగిన వింత సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో భార్యను ప్రేమించిన వాడితో పంపించేందుకు అంగీకరించాడు రాజేశ్ అనే వ్యక్తి. అందుకు పరిహారంగా 71 గొర్రెలను పొందాడు. చివరికి అతనిపై గొర్రెల దొంగతనం చేసిన కేసు నమోదయింది.
ఇదీ జరిగింది....
ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌కు చెందిన రాజేశ్ గత జులై 22న తన భార్య.. ఉమశ్ అనే వ్యక్తితో వెళ్లిపోయిందని పంచాయతీలో ఫిర్యాదు చేశాడు. అనంతరం ముగ్గురుని విచారించారు గ్రామ పెద్దలు. పంచాయతీలో వారు తమ ప్రేమను ఒప్పుకున్నారు. తన భర్తతో సంతోషంగా లేనని ప్రియురాలు తెలిపింది.
పరిశీలించిన పెద్దలు ఉమేశ్‌కు రెండు అవకాశాలు ఇచ్చారు. వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలి లేదా ప్రియురాలి భర్తకు గొర్రెల మందను ఇవ్వాలని తీర్పు వెలువరించారు. అతనికి జీవనాధారమైన గొర్రెలనే ఇచ్చేందుకు ఒప్పకున్నాడు ఉమేశ్. రాజేశ్‌కు 71 గొర్రెలను ఇచ్చాడు.
కొన్ని రోజుల తర్వాత ప్రియుడు ఉమేశ్ తండ్రి పంచాయతీ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. తన గొర్రెలను రాజేశ్ దొంగలించాడని ఆరోపించాడు. గొర్రెలను ఇప్పించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేశ్‌ను అరెస్ట్ చేసి... అతని వద్ద నుంచి 71 గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు.
" ఉమేశ్ తండ్రి తన గొర్రెలు పోయినట్లు ఫిర్యాదు చేశాడు. సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం నిందితుడి నుంచి గొర్రెలను స్వాధీనం చేసుకుని అతని తండ్రికి అప్పగించాం. మహిళ ప్రియుడితో వెళ్లిన విషయంలో మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ప్రస్తుతం వివాహం, సహజీవనం సంబంధాల్లో పోలీసులు జోక్యం చేసుకోవటానకి వీలు లేదు. మహిళగాని, పురుషుడు గాని ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తాం."
-డా.సునీల్ గుప్తా, ఎస్పీ
ఇదీ చూడండి: 'కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన'