ETV Bharat / bharat

ఉన్నావ్​ కేసులో కుల్​దీప్​ సెంగార్​కు పదేళ్ల జైలు - దిల్లీ హైకోర్టు

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్​దీప్​ సింగ్​ సెంగార్​కు పదేళ్ల జైలు శిక్ష విధించింది దిల్లీ కోర్టు. ఇద్దరు దోషులు కలిసి.. బాధితురాలి కుటుంబానికి రూ.20లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఉన్నావ్​ అత్యాచార కేసులో ఇప్పటికే జీవితఖైదు అనుభవిస్తున్నాడు సెంగార్​.

Unnao case: Delhi court sentences expelled BJP MLA Kuldeep Sengar to 10 years in prison
ఉన్నావ్​ కేసు: కుల్​దీప్​ సెంగార్​కు మరో పదేళ్ల జైలు
author img

By

Published : Mar 13, 2020, 12:49 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం కీలక నిర్ణయం వెలువరించింది. ఈ కేసులో భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్​దీప్​ సింగ్​ సెంగార్ సహా దోషులందరికీ పదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా కుల్​దీప్​ సింగ్,​ అతని సోదరుడు అతుల్​ సెంగార్.. బాధిత కుటుంబానికి ఒక్కొక్కరు రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

2017లో ఓ మైనర్‌ బాలికను అపహరించి అత్యాచారం జరిపిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు సెంగార్​. కేసు విచారణ సందర్భంగా.. బాధితురాలి తండ్రి 2018 ఏప్రిల్​ 9న జ్యుడీషియల్​ కస్టడీలో మరణించారు. ఆయన మృతి వెనుక సెంగార్​ హస్తం ఉందని సీబీఐ బలమైన సాక్ష్యాలను దిల్లీకోర్టు ఎదుట ప్రవేశ పెట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సెంగార్​కు ఈ కేసులో పదేళ్ల జైలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి: గూగుల్​ ఉద్యోగికి కరోనా.. ఇంటి నుంచే పనిచేయాలని సూచన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.