కర్ణాటకలోని బెళగావిలో ఓ రెండేళ్ల బాలుడు తాచుపాము బారి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఓ పొలంలో ఆడుకుంటుండగా బాలుడికి తాచుపాము కనిపించింది. దాని తోక పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఆ బాలుడు.
ఇదీ జరిగింది...
బెళగావి జిల్లాలోని కంగ్రెల్లిలో ఓ తండ్రి తన కొడుకు వేదాంత్‌ను పొలానికి తీసుకెళ్లాడు. తన రెండేళ్ల బాలుడు ఆడుకుంటుండగా ఆ దృశ్యాలను వీడియో తీయడం మొదలుపెట్టాడు. ఇంతలో ఓ తాచుపాము అటుగా వెళ్లింది. అది గమనించిన వేదాంత్ దానివైపు పరిగెత్తాడు. దాని తోకను పట్టుకోవాలని ప్రయత్నించాడు.
ఇది గమనించిన తండ్రి.. తన వద్దకు వచ్చేయమని వేదాంత్వైపు చూసి అరిచాడు. అనంతరం కొడుకువైపు పరిగెత్తాడు. ఇంతలో తాచుపాము అక్కడి నుంచి తప్పించుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై వేదాంత్ తాత స్పందించారు. పాములు అందరినీ కాటేస్తాయన్న ధోరణితో ఉండకూదని తెలిపారు. పాముకు హాని తలపెడితేనే అది మనిషిని కాటేస్తుందని.. లేకపోతే ఏమీ చేయవని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన నుంచి తమ మనవడు సురక్షితంగా బయటపడటం సంతోషకరమన్నారు.