రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లోని సజ్జన్‌గఢ్ జీవారణ్యంలో రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకటి ప్రాణాలు కోల్పోయింది. 12 ఏళ్ల కుమార్ అనే మగ పులి.. 15 ఏళ్ల దామిని అనే ఆడపులిని చంపేసింది.
దామిని నివసిస్తోన్న ప్రాంతంలోకి ఎన్‌క్లోజర్ ధ్వంసం చేసి కుమార్ రావటమే ఈ ఘర్షణకు దారితీసింది. మగ పులి చేసిన దాడిలో దామిని తీవ్రంగా గాయపడి.. ప్రాణాలు కోల్పోయింది.
ఇక్కడ విధులు నిర్వహించే షూటర్ సత్నామ్ సింగ్.. గోమతికి వెళ్లారు. అయితే సమయానికి సిబ్బంది అందుబాటులో లేకపోవటం వల్ల దామినిని కాపాడలేకపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని అటవీ శాఖ ప్రకటించింది.
ఇదీ చూడండి: పిడిగుద్దుల పోటీతో కొత్త ఏడాదికి స్వాగతం