మహారాష్ట్ర చంద్రపుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ట్రక్కులోకి దూసుకెళ్లిన కారు...
అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో చంద్రపుర్-ముల్ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి సుమారుగా 30కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు నియంత్రణ కోల్పోయి... ట్రక్కులోకి దూసుకెళ్లడం వల్ల ఈ ఘటన జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: 'భారతీయుడు-2' సెట్స్‌లో ప్రమాదంపై కమల్ విచారం