100 మందితో కూడిన తొలి మహిళా ఆర్మీ పోలీసులకు జనవరి 6 నుంచి శిక్షణ ప్రారంభమైనట్లు సైన్యాధిపతి ముకుంద్ నరవాణే తెలిపారు.
దేశ చరిత్రలో తొలిసారి గత ఏడాది నుంచి మహిళలను మిలిటరీ పోలీసు విభాగంలోకి తీసుకోవడం ప్రారంభించారు. అప్పటి సైన్యాధిపతి, ప్రస్తుత సీడీఎస్ బిపిన్ రావత్ మహిళలను సైన్యంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిన రెండేళ్ల తర్వాత ఇది అమల్లోకి వచ్చింది.
మహిళలకు పోరాట బాధ్యతలు ఎప్పుడు ఇవ్వనున్నారు అన్న ప్రశ్నకు.. పరోక్షంగా సమాధానమిస్తూ జనవరి 6 నుంచి తొలి బ్యాచ్ మహిళా ఆర్మీ జవాన్లకు శిక్షణ ప్రారంభమైనట్లు వెల్లడించారు నరవణే.
మహిళలను సైన్యంలోకి తీసుకునే విషయంపై 2017లోనే ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటన చేశారు. అందులో భాగంగా తొలిసారిగా మిలిటరీ పోలీసు విభాగంలోకి మహిళలను తీసుకున్నారు.
ప్రస్తుతం మహిళలు సైన్యంలో ఉన్న వైద్యం, చట్టాలు, విద్య, సిగ్నల్స్, ఇంజనీరింగ్లో వారికి నచ్చిన విభాగాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:స్వతంత్ర అనంతరం చరిత్ర విస్మరణ: మోదీ