ETV Bharat / bharat

స్వతంత్రం అనంతరం చరిత్ర విస్మరణ: మోదీ - History written after Independence overlooked several major aspects: PM Modi

బంగాల్​లో ఇటీవల నవీకరించిన నాలుగు చారిత్రక కట్టడాలను జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వాతంత్య్రానంతరం పలు ముఖ్యమైన అధ్యయనాలను చరిత్రకారులు విస్మరించారన్నారు. కోల్​కతా పోర్ట్​ ట్రస్ట్ 150వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు మోదీ. అనంతరం హావ్​డా బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన లైట్​షోను ప్రారంభించారు.

modi
మోదీ
author img

By

Published : Jan 11, 2020, 9:26 PM IST

Updated : Jan 12, 2020, 6:34 AM IST

స్వాతంత్ర్య అనంతరం రాసిన చరిత్రలో పలు ముఖ్యమైన అధ్యయనాలు, అంశాలను చరిత్రకారులు విస్మరించారన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచం ముందు ఉన్నతమైన భారత సంస్కృతిని చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వారసత్వ కట్టడాలను పర్యటకంగా అభివృద్ధి చేయడం ద్వారా ఇది సాధ్యమౌతుందన్నారు. బంగాల్​లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోల్​కతా పోర్ట్​ ట్రస్ట్​ 150వ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. బంగాల్ గవర్నర్ జగదీప్​ ధన్​కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి హావ్​డా వంతన వద్ద లైట్​షోను ప్రారంభించారు. హూబ్లీ నది తీరంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు ప్రధాని.

అంతకుముందు వారసత్వ భవంతులైన ఓల్డ్ కరెన్సీ బిల్డింగ్, బెల్వెదెరె హౌస్, మెట్ కాఫె హౌస్, విక్టోరియా మెమోరియల్ హాలును జాతికి అంకితం చేశారు. ఈ నాలుగు భవంతులను ఇటీవల సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పునరుద్ధరించింది.

"బంగాల్​ సహా భారత్ కళా, సాహిత్య రంగాల్లో ఈ రోజు అత్యంత ప్రాముఖ్యమైనది. పునస్థాపన, పునఃవ్యవస్థీరణ, నవీకరణ దిశగా జాతీయ స్థాయి పథకాన్ని బంగాల్ నుంచి నేడు ప్రారంభిస్తున్నాం. పరంపర, పర్యటకం అనేవి మన వారసత్వ సంపద, భావాలు, మన గుర్తింపుతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఆరంభం నుంచి నాటకీయంగా..

ప్రధాని బంగాల్ పర్యటన ఆది నుంచి నాటకీయంగా సాగుతోంది. కోల్​కతాలో అడుగుపెట్టగానే పౌరచట్ట సవరణ, ఎన్ఆర్​సీలకు వ్యతిరేకంగా విమానాశ్రయం వద్ద నిరసనలు చేశారు ఆందోళనకారులు. అనంతరం మోదీతో భేటీ అయ్యారు దీదీ. ఆ వెంటనే పౌరచట్ట, ఎన్​ఆర్​సీ వ్యతిరేక ధర్నాలో పాల్గొన్నారు మమత. తర్వాత లైట్​ షో ప్రారంభోత్సవం వద్ద ఇరునేతలు వేదిక పంచుకున్నారు.

ఇదీ చూడండి: మోదీతో దీదీ భేటీ.. పౌర చట్టం ఉపసంహరణకు విజ్ఞప్తి

Intro:Body:Conclusion:
Last Updated : Jan 12, 2020, 6:34 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.