తమిళనాడు రాజధాని చెన్నైలో నీటి ఎద్దడిని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగిస్తోంది. ఇప్పటికే సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే ప్లాంటులను ఏర్పాటు చేసింది. తాజాగా రైలు ద్వారా నీటిని సరఫరా చేస్తోంది.
వెల్లూరు జిల్లా జోలార్‌పేట రైల్వే స్టేషన్ నుంచి చెన్నైకు తొలి రైలు ట్యాంకర్ పంపింది రాష్ట్ర ప్రభుత్వం. అధికారులు పూజలు నిర్వహించి జెండా ఊపిన తర్వాత ట్యాంకర్ బయలుదేరింది.
గతంలో ఎన్నడూ లేనంతగా చెన్నైలో నీటి ఎద్దడి నెలకొంది. అనేక సాఫ్ట్వేర్ సంస్థలు ఇంటి వద్ద నుంచే తమ ఉద్యోగులను పనిచేయాలని సూచించాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా అంచనా వేయొచ్చు.
ఇదీ చూడండి: చెన్నై నీటి సమస్యపై స్పందించిన టైటానిక్ హీరో