ETV Bharat / bharat

ఏటా రూ.లక్ష కోట్ల టోల్​ రాబడే లక్ష్యం: గడ్కరీ

వచ్చే ఐదేళ్లలో ఏడాదికి టోల్​ వసూళ్ల రూపంలో రూ.లక్ష కోట్లు వస్తాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. 27 వేల కి.మీ. పొడవైన రహదారులను ఈ సంవత్సరం చివరి నాటికి టోల్ పరిధిలోకి తీసుకువస్తామని తెలిపారు.

ఏటా రూ.లక్ష కోట్ల టోల్​ రాబడే లక్ష్యం: నితిన్ గడ్కరీ
author img

By

Published : Oct 15, 2019, 5:31 AM IST

భారత్​లో టోల్​ రాబడి.. వచ్చే ఐదేళ్లలో ఏడాదికి రూ.లక్ష కోట్లకు చేరుకుంటుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. రహదారులపై పన్ను వసూలుకు ఉన్న అవరోధాలను తొలగించడానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎలక్ట్రానిక్ టోల్​ వంటి చర్యలు సహాయపడతాయన్నారు.

దేశంలో 1.4 లక్షల కిలోమీటర్ల రహదారులు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్​హెచ్​ఏఐ) పరిధిలో ఉన్నాయని.. 24,996 కిలోమీటర్ల రహాదారులు ప్రస్తుతం టోల్ పరిధిలో ఉన్నాయన్నారు. ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 27 వేల కిలోమీటర్లకు పెంచనున్నట్లు తెలిపారు.

2019 డిసెంబర్​ 1 నుంచి టోల్​ ఛార్జీలు ఫాస్టాగ్​ ద్వారానే వసూలు చేయనున్నట్లు తెలిపారు నితిన్​ గడ్కరీ.

"టోల్ ఆదాయం ఏడాదికి రూ. 30 వేల కోట్లు ఉంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున రహదారులు నిర్మిస్తున్నందున వచ్చే ఐదేళ్లలో ఈ రాబడిని ఏడాదికి రూ.లక్ష కోట్లకు పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఆదాయం పెరిగితే బ్యాంకులు, ఇతర మార్కెట్ల నుంచి రుణాలు తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది. వాటిని మరో ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగపడుతుంది.'

--నితిన్ గడ్కరీ, కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి

జీడీపీకీ మేలు

'ఒకే దేశం ఒకే ట్యాగ్-ఫాస్టాగ్-వాహనాల ఆధార్​' అనే సమావేశంలో పాల్గొన్న మంత్రి ఫాస్టాగ్​ కోసం ప్రీపెయిడ్ వాలెట్​ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ఆయన నిర్మాణంలో ఉన్న రహదారులలో దాదాపు 75 శాతం ఎన్​హెచ్​ఏఐ పరిధిలోనే ఉన్నాయని తెలిపారు. నగదు రహిత వ్యవస్థ వల్ల సమయం ఆదా అవుతుందని అన్నారు. అంతేకాక టోల్​ ప్లాజాల వద్ద వేచి చూసే అవస్థలు తప్పుతాయని, ఫలితంగా ఇంధనం ఆదా చేయవచ్చన్నారు. దీని వల్ల జీడీపీకి మేలు జరుతుందని అభిప్రాయపడ్డారు.

ఫాస్టాగ్..​

ఫాస్టాగ్​ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికత కలిగిన పరికరం. దీని సాయంతో వాహనానికి అనుసంధానించిన ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ ఖాతాల నుంచే టోల్ ఛార్జీలను చెల్లించవచ్చు. నగదు లావాదేవీల కోసం టోల్ ప్లాజాల వద్ద వాహనం ఆపకుండానే రహదారిపై ప్రయాణం సాగించే అవకాశం లభిస్తుంది.

ఈ-వే బిల్లు వ్యవస్థ జీఎస్​టీతో అనుసంధానం

ఈ-వే బిల్లు వ్యవస్థను జీఎస్​టీతో అనుసంధానించడం వల్ల భారీ సంస్కరణలకు నాంది పలుకుతుందన్నారు గడ్కరీ. వాహనాల కదలికలను పరిశీలించవచ్చని తెలిపారు. ఈ-వే బిల్లులో పేర్కొన్న ప్రకారం సరైన గమ్యానికి వాహనాలు వెళ్తున్నాయో లేదో అన్న విషయాన్ని అధికారులు పరిశీలించవచ్చని వెల్లడించారు.

ప్రస్తుతం ఉన్న ఈ-వే బిల్లు వ్యవస్థలో కొన్ని లోపాలు గుర్తించినట్లు తెలిపారు. ప్రయాణికులు ఒకే బిల్లుతో ఎక్కువ సార్లు ప్రయాణిస్తున్నారన్నారు.

రాష్ట్రాలలో ఉన్న టోల్​ ప్లాజాలను జాతీయ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రోగ్రామ్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల రవాణా కార్పొరేషన్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గడ్కరీ వెల్లడించారు. రాష్ట్రాలకు అన్ని రకాల సాంకేతిక సహాయాన్ని కేంద్రం అందిస్తుందని తెలిపారు.

ఇదీ చూడండి : ముంబయి నుంచి నోబెల్​ వరకు.. అభిజిత్​ ప్రస్థానం

Hazaribagh (Jharkhand), Oct 14 (ANI): Ahead of Assembly elections in Jharkhand, Chief Minister Raghubar Das's 'Johar Jan Aashirwad Yatra' reached Hazaribagh. His supporters also took part in the yatra in great numbers. While addressing the public, CM Das said, "After becoming the Chief Minister, I gave preference to two-three things because I believe that developing an area means developing a village. You make roads and provide access to electricity in that village means that the development of that village, the development of that area will begin." He further said, "Soon 'Pradhan Mantri Gram Sadak Yojana' of 1,100 crores will start in the whole region."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.