ETV Bharat / state

పాతికేళ్ల అవసరాలకు తగ్గట్టుగా '2050' - హైదరాబాద్‌ దిశ మార్చేలా మాస్టర్‌ప్లాన్‌!

తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా కాంగ్రెస్ సర్కార్ ముందడుగు

Telangana Govt Focus On Hyd Development
Hyderabad Master Plan 2050 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2024, 10:53 AM IST

Hyderabad Master Plan 2050 : హైదరాబాద్‌ దశ దిశ మార్చేందుకు రాష్ట్ర సర్కార్​ సిద్ధమవుతోందని, రానున్న పాతికేళ్ల అవసరాలకు తగ్గట్టుగా 2050-మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తోందని సీఎం కార్యాలయం (సీఎంవో) వెల్లడించింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మహా నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ఫ్యూచర్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర​ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో హైదరాబాద్‌ అభివృద్ధికి తీసుకున్న చర్యలపై సీఎంవో మంగళవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది.

‘‘నగరంలో ట్రాఫిక్‌ సమస్యలను తొలగించేందుకు రూ.2,232 కోట్లతో రాజీవ్‌ రహదారిపై ఎలివేటెడ్‌ కారిడార్, రూ.1,580 కోట్లతో నాగ్‌పుర్‌ నేషనల్ హైవేపై డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణాలకు సీఎం రేవంత్‌ భూమిపూజ చేశారు. ముఖ్యంగా మెహిదీపట్నం వద్ద స్కైవాక్‌ నిర్మాణానికి రక్షణ శాఖ పర్మిషన్ తెప్పించడం పెద్ద విజయం’’ అని సీఎంవో పేర్కొంది.

మెట్రో రెండో దశకు ఆమోదం : ‘‘రూ.24,237 కోట్లతో మెట్రో సెకండ్​ పేజ్​ పనులకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. నగరం చుట్టూ రూ.18 వేల కోట్లతో ఆర్‌ఆర్‌ఆర్‌ (ఔటర్​ రింగ్​ రోడ్డు) నిర్మించనున్నారు. హెచ్‌సీఐటీఐ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్ల నిర్మాణానికి రూ.8,996 కోట్లతో ప్రపోజల్స్ సిద్ధంచేసి రూ.596 కోట్ల అంచనాలతో వరదనీటి కాల్వలను, కూడళ్లలో వర్షపు నీరు నిలవకుండా భూగర్భబావులను ఏర్పాటు చేస్తున్నారు. కేబీఆర్‌ పార్కు చుట్టూ రూ.826 కోట్లతో ఆరు జంక్షన్లను డెవలప్​మెంట్​ చేయనున్నారు. రూ.360 కోట్లతో మీరాలం చెరువు వద్ద 4 లేన్ల ఫ్లైఓవర్​ నిర్మిస్తున్నారు.

30,000 ఎకరాల్లో ఫ్యూచర్‌సిటీ నిర్మించనున్నారు. ఫార్మాసిటీతోపాటు ఏఐ నగరం, సాఫ్ట్‌వేర్, లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్‌ టెక్నాలజీ వంటి అధునాతన టెక్నాలజీ పరిశ్రమల కేంద్రంగా ఫ్యూచర్‌ సిటీని తీర్చిదిద్దబోతున్నారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ వర్సిటీకి ఇప్పటికే శంకుస్థాపన చేయగా త్వరలోనే క్రీడా యూనివర్సిటిని నెలకొల్పబోతున్నారు’’ అని సీఎంవో ప్రకటనలో వివరించింది.

మూసీ పునరుజ్జీవం - చెరువుల పరిరక్షణకు పెద్దపీట : హైదరాబాద్‌లో చెరువులు, నాళాలు, గవర్నమెంట్​ ఆస్తుల పరిరక్షణకు హైడ్రాను ఏర్పాటు చేశారని, మూసీ పునరుజ్జీవంతోపాటు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతిపాదనలు రెడీ చేశారంది. ‘‘మూసీలోకి చేరుతున్న మురుగును కంప్లీట్​గా శుభ్రం చేసేందుకు కొత్తగా 39 ఎస్‌టీపీలను ఏర్పాటు చేయబోతున్నారు. ఎల్లంపల్లి నుంచి 20 టీఎంసీల నీటిని తరలించి, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు తీర్చేలా భారీ ప్రణాళికలు చేస్తున్నారు. బాపూఘాట్‌ను తీర్చిదిద్ది, గాంధీ ఐడియాలజీ సెంటర్​ను ఏర్పాటు చేయబోతున్నారు’’ అని సీఎంవో పేర్కొంది.

క్యాంప్​ఫైర్​, యోగా, సైక్లింగ్​ కోసం ఎక్కడెక్కడికో వెళుతున్నారా? - ఇప్పుడు అన్నీ మన హైదరాబాద్​ పార్కుల్లోనే..!

హైదరాబాద్ అభివృద్ధిపై రేవంత్​ స్పెషల్​ నజర్​ - ఇండోర్ తరహాలో తీర్చిదిద్దాలని ఆదేశాలు! - CM Revanth Review On GHMC

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.