టిక్‌టాక్‌లో వీడియో పోస్ట్ చేసేందుకు ప్రమాదక విన్యాసాలు చేస్తూ గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా గూడెకెరెలో ఉంటున్న కుమార్(26) అనే యువకుడు ఈ నెల 17వ తేదీన టిక్‌టాక్ కోసం వినూత్నంగా వీడియో రూపొందించాలని విన్యాసాలు చేశాడు. ఆ క్రమంలో కిందపడిపోయి అతడి మెడ పూస విరిగింది. వెంటనే చికిత్స కోసం అతడిని కుటుంబ సభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు.. కోలుకోలేక ఆదివారం మృతి చెందాడు.
ఇదీ చూడండి: డబ్బే కాదు... ఏటీఎం మొత్తాన్ని ఎత్తుకెళ్లారు!