బిహార్ గయా జిల్లాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు అధికారులు తెలిపారు. భారాచట్టి అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి నుంచి భద్రతాదళాలకు, మావోయిస్టులకు మధ్య తీవ్రపోరు జరిగినట్లు వెల్లడించారు.
ఘటనా స్థలం నుంచి నక్సలైట్ల మృతదేహాలు, రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ జాయింట్ ఆపరేషన్లో కేంద్రబలగాలతో పాటు బిహార్ పోలీసులు పాల్గొన్నారు.