ETV Bharat / bharat

మొట్టమొదటి ఏకదంతుడి విగ్రహ ప్రతిష్ఠ అక్కడే! - Dantewada latest news

ఛత్తీస్​గఢ్​లో 2500 అడుగుల ఎత్తులో ధోల్కల్ పర్వతంపై విశిష్ట చరిత్రగల గణేశుడి విగ్రహం వందల ఏళ్లుగా భక్తుల పూజలు అందుకుంటోంది. ఏకదంతుని రూపంలో ఉన్న ఈ వినాయకుడి ప్రతిమను పరశురామునితో చేసిన పోరాటానికి గుర్తుగా 11వ శతాబ్దంలో చిందక్​ నాగవంశీయులు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ విగ్రహానికి భోగామి తెగకు చెందిన వారు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

This 11th century Ganesh idol placed on a hilltop in Dantewada
ధోల్కల్ పర్వతంపై 2500 అడుగు ఎత్తులో విఘ్నేషుడు
author img

By

Published : Aug 29, 2020, 12:50 PM IST

'ఏకందతాయ వక్రతుండాయ గౌరీ తనయ ధీమహి' అనగానే విఘ్నేశ్వరుడని అందరికీ అర్థమవుతుంది. అయితే ఏకదంతుని రూపంలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మొట్టమొదట ఎక్కడ ఏర్పాటు చేశారని మాత్రం ఎక్కువ మందికి తెలియకపోవచ్చు.

ఛత్తీస్​గఢ్​ దంతెవాడ జిల్లాలో ధోల్కల్ పర్వతంపై 2500 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఏకదంత వినాయక విగ్రహామే మొదటిదని ప్రాచుర్యంలో ఉంది. చిందక్ నాగవంశీయులు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పరశురాముడు, గణేశుడికి మధ్య జరిగిన యుద్ధానికి గుర్తుగా దీనిని ప్రతిష్ఠించారు.

పురాణాల ప్రకారం విఘ్నేశ్వరునికి, పరశురాముడికి ఈ పర్వతంపైనే యుద్ధం జరిగిందని. అప్పుడు వినాయకుడి దంతం ఒకటి ఇక్కడ విరిగిపడిందని స్థానికులు విశ్వసిస్తున్నారు.

ధోల్కల్ పర్వతంపై 2500 అడుగు ఎత్తులో విఘ్నేషుడు

" శివుడిని కలిసేందుకు వచ్చిన పరశురాముడ్ని వినాయకుడు అడ్డుకున్నాడు. అప్పుడే ఇద్ధరి మధ్య భీకర పోరు జరిగింది. ఈ యుద్ధంలోనే గణేశుని దంతం ఒకటి విరిగిపోయింది. అప్పటి నుంచే ఆయనను ఏకదంతాయ అని పిలుస్తున్నారు. ఈ యుద్ధానికి గుర్తుగానే చిందక్ నాగవంశీయులు ధోల్కల్​ పర్వతంపై ఏకదంత వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు"

హేమంత్ కశ్యప్​, బస్తర్​కు చెందిన నిపుణుడు.

పరుశురాముడి గొడ్డలి వల్లే వినాయకుడి దంతం విరిగిపడింది, అందుకే ఈ పర్వతం ఉన్న గ్రామానికి ఫరస్​పల్​ అనే పేరువచ్చిందని కశ్యప్​ తెలిపారు.

ఇంద్రావతి నదిలోని రాళ్లతో..

ఈ విగ్రహాన్ని ఎంతో ప్రత్యేకంగా తయారు చేసేందుకు ఇంద్రావతి నదిలోని రాళ్లను వినియోగించారు. 3 అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పు ఉన్న ఈ ప్రతిమను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. విఘ్నేశుడి కుడి చేతిలో గొడ్డలి, ఎడమ చేతిలో దంతం ఉన్నాయి. లలితాసనంలో కూర్చుని రుద్రాక్షమాల పట్టుకుని, ఉదరానికి నాగుపాము ధరించాడు. ఈ విగ్రహానికి భోగామి తెగకు చెందిన వారు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ విగ్రహానికి మొట్టమొదట భోగామి తెగకు చెందిన మహిళ పూజలు నిర్వహించినట్లు ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఆమె పర్వతంపై నుంచి శంఖం పూరించిన తర్వాత ఫరస్​పల్ గ్రామస్థులు మేల్కొన్నట్లు విశ్వసిస్తారు.

ఏడాదంతా ఈ విగ్రహానికి గ్రామస్థులు నిత్యం పూజలు చేస్తుంటారు. వేసవిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో ఇతరులు కూడా దర్శనానికి వస్తారు.

ఇదీ చూడండి: సాంకేతిక రక్షణ అండగా.. 'బతుకు' మళ్లీ గొప్పగా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.