అజిత్ కృష్ణ... కేరళకు చెందిన 13 ఏళ్ల బాలుడు. చిన్న వయసులోనే కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు సైకిల్‌పై వచ్చిన అజిత్‌ను చూసి కేంద్ర హోంశాఖ మురిసిపోయింది. అతడి సంకల్పానికి మెచ్చి పంజాబ్ వాఘా సరిహద్దులో సాదర స్వాగతం పలికింది. వాఘాలో బీఎస్ఎఫ్ పరేడ్, జెండా ఆవిష్కరణకు ప్రత్యేకంగా ఆహ్వానించింది హోంశాఖ.
అత్యంత దూరం సైకిల్‌పై ప్రయాణించిన బాలుడి(15 ఏళ్లలోపు)గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాలని అజిత్ లక్ష్యం. అనుకున్నదే తడవుగా పాలక్కడ్ జిల్లా చిత్తూరు నుంచి 2019 జులై 10న సైకిల్‌పై దేశయాత్రకు బయలుదేరాడు. 30 రోజుల్లో 4 వేల కిలోమీటర్లకుపైగా ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు.
అజిత్ పట్టుదల ముందు ఆ సమయం చాలా ఎక్కువైపోయింది. 25 రోజుల్లోనే కశ్మీర్‌కు చేరుకున్నాడు. ఇక గిన్నిస్ రికార్డు అధికారికంగా వరించటమే మిగిలింది.
ఇదీ చూడండి: అలనాటి ఫ్యాషన్‌కు.. నేటి తరం సొబగులు!