ఆర్జేడీ నేత శ్యామ్ రజక్ చేసిన వ్యాఖ్యలు బిహార్ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. అధికార జేడీయూకు చెందిన 17మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన చెప్పారు. అయితే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తాము ఉల్లంఘించాలనుకోవడం లేదని, మొత్తం 28మంది ఎమ్మేల్యేలు బృందంగా వస్తేనే ఆర్జేడీలోకి స్వాగతిస్తామని వారికి చెప్పినట్లు పేర్కొన్నారు. త్వరలోనే వారంతా ఆర్జేడీలోకి వస్తారన్నారు.
ఈ విషయంపై బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమర్ స్పందించారు. ఆర్జేడీ నేత వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు.