'కుంభనెల' (మలయాళ నెల) పూజలకు ఎక్కువ మంది భక్తులను అనుమతించాలని శబరిమల అయ్యప్ప దేవస్థానం బోర్డు చేసిన విజ్ఞప్తిని కేరళ ప్రభుత్వం తోసిపుచ్చింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే 5,000మంది భక్తులను అనుమతించామని.. అంతకుమించి కుదరదని స్పష్టం చేసింది.
కరోనా భయం..
కుంభనెల నేపథ్యంలో 15వేల మంది భక్తులకు అవకాశం కల్పించాలని కోరుతూ.. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖపై స్పందించిన ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొన్న కరోనా తీవ్రతను అంచనా వేసి.. నిర్ణయాన్ని వెల్లడించాల్సిందిగా వైద్యాఆరోగ్య శాఖను ఆదేశించింది. ఆలయంలోకి ఎక్కువ మంది భక్తులను అనుమతిస్తే.. కరోనా తీవ్రత పెరిగే అవకాశముందనే హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
'కుంభనెల' ప్రత్యేక పూజల కోసం ఈ నెల 12న శబరిమల ఆలయం తెరుచుకోనుంది.
ఇదీ చదవండి: 200 మంది కేరళ విద్యార్థులకు కరోనా!