కరోనా కాలం కదా అని ఆషాఢమాసం.. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయకపోతే ఆ మహమ్మారిని అంతం చేయడానికి అమ్మ కనికరిస్తుందా? అందుకే, కర్ణాటకలో ఆషాఢం చివరి శుక్రవారాన.. చాముండేశ్వరీ అమ్మవారిని కాలీఫ్లవర్లతో అలకరించి.. కరోనా నుంచి కాపాడమంటూ వేడుకున్నారు భక్తులు.
మండ్య జిల్లా, శ్రీరంగపట్నంలోని చాముండేశ్వరీ మాతా ఆలయాన్ని గోబీ పువ్వులు, ఇతర కూరగాయలతో అలంకరించారు భక్తులు. వేద పండితులు లక్ష్మీశర ఆధ్వర్యంలో చండీ యాగం, గణపతి హోమం, పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. కొవిడ్ బారి నుంచి ప్రజలను కాపాడి, రైతులను చల్లగా చూడమని కోరుకున్నారు.
ఇదీ చదవండి: ఆషాఢం.. శూన్యమాసమే కాదు అమ్మవారి మాసం!