ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ముగ్గురు ముష్కరులు హతం - జమ్ముకశ్మీర్​లో ఎదురు కాల్పులు

జమ్ముకశ్మీర్​ బారాముల్లా సోపోర్​ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రత బలగాలు. మృతుల్లో ఒకరు పాకిస్థాన్​ వాసిగా గుర్తించారు. వీరి నుంచి ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Terrorist killed in encounter in Jammu-Kashmir's Sopore
జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఓ ముష్కరుడు మృతి
author img

By

Published : Jul 12, 2020, 3:16 PM IST

Updated : Jul 12, 2020, 9:51 PM IST

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లా సోపోర్​ ప్రాంతంలో ఎన్​కౌంటర్​ జరిగింది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఒకర్ని పాకిస్థాన్​ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు వెల్లడించారు. వీరి నుంచి ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

కశ్మీర్​లో ఎన్​కౌంటర్

సోపోర్​ పట్టణంలోని రెబాన్​ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో అర్ధరాత్రి భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా దళాలను గమనించిన ముష్కరులు ఉదయం 4 గంటల సమయంలో కాల్పులకు తెగబడ్డారు. ఇరువురి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల్ని హత మార్చాయి దళాలు.

"ఈ ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్ లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది ఉస్మాన్ మృతి చెందాడు. అతను ఇటీవల సోపోర్​లో జరిగిన ఉగ్ర దాడిలో పాల్గొన్నాడు. ఈ ఘటనలో ఒక సీఆర్​పీఎఫ్ జవాన్ అమరుడు కాగా మరో పౌరుడు కూడా మృతి చెందాడు. పోలీసులకు, భద్రతా దళాలకు ఇది భారీ విజయం" అని కశ్మీర్​ జోన్​ పోలీసులు ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి:శిశువు అనుకుని బొమ్మకు పోస్ట్​మార్టం... చివరకు...

Last Updated : Jul 12, 2020, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.