ETV Bharat / bharat

తెరాసకు 3-తెదేపాకు 4

2017-18లో అత్యధిక ఆదాయం పొందిన ప్రాంతీయ పార్టీగా సమాజ్​వాదీ పార్టీ నిలిచింది. డీఎంకే, తెరాస, తెదేపా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

తెరాసకు 3-తెదేపాకు 4
author img

By

Published : Mar 8, 2019, 4:01 PM IST

Updated : Mar 8, 2019, 5:12 PM IST

తెరాసకు 3-తెదేపాకు 4

2017-18 సంవత్సరానికి రూ. 47.19 కోట్లతో అత్యధిక ఆదాయం పొందిన ప్రాంతీయ పార్టీగా సమాజ్​వాదీ పార్టీ(ఎస్​పీ) నిలిచింది. రూ. 35.748 కోట్లతో డీఎంకే, రూ. 27.17 కోట్లతో తెలంగాణ రాష్ట్ర సమితి, రూ. 19.4 కోట్లతో తెలుగుదేశం, రూ. 14.239 కోట్ల ఆదాయంతో వైకాపా తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

ఎన్నికల సంఘానికి పార్టీలు సమర్పించిన ఆడిట్​ రిపోర్టు ఆధారంగా ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్​) ఈ విషయాలు వెల్లడించింది.

37 పార్టీలు..

దేశంలో 48 గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలున్నాయి. వీటిలో 37 ప్రాంతీయ పార్టీలు ఆడిట్​ రిపోర్టు సమర్పించాయి. ఆదాయ, వ్యయ నివేదిక సమర్పించని వాటిలో బీపీఎఫ్​, జేకేఎన్సీ, జేకేపీడీపీ లాంటి పార్టీలు ఉన్నాయి.

అన్ని ప్రాంతీయ పార్టీల ఆదాయం కలిపి రూ. 237 కోట్లు. ఇందులో ఎస్​పీ, డీఎంకే, టీఆర్​ఎస్​ పార్టీల ఆదాయం 46.65 శాతం(రూ. 110.21 కోట్లు). ఎస్​పీ వాటా 19.89 శాతం. డీఎంకేకు 15.07 శాతం, తెరాసకు​ 11.49 శాతం వాటా ఉంది.

తగ్గిన ఆదాయం...

2016-17తో పోల్చితే 2017-18లో 15 ప్రాంతీయ పార్టీల ఆదాయం తగ్గింది. 34 పార్టీల ఆదాయం రూ. 409.64 కోట్ల నుంచి 42 శాతం ప్రతికూల వృద్ధితో రూ. 236.86 కోట్లకు చేరింది.

ఖర్చులోనూ ఎస్​పీనే...

37 పార్టీలు చేసిన వ్యయం రూ.170.45 కోట్లు. ఇందులో 20.26 శాతం(రూ. 34.539 కోట్లు) వాటాతో ఎస్​పీ మొదటి స్థానంలో ఉంది. రూ. 27.47 కోట్లతో డీఎంకే, రూ.16.73 కోట్లతో తెదేపా తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పార్టీలన్నింటి ఖర్చులో ఈ మూడు పార్టీల వాటా 46.19 శాతం.

జేడీఎస్​ టాప్​....

ఖర్చు చేయని ఆదాయాన్ని 22 పార్టీలు ప్రకటించాయి. జేడీఎస్​, జేడీయూలు 85 శాతం, అన్నా డీఎంకే 63 శాతం ఆదాయాన్ని ఖర్చు చేయలేదు. వైకాపా రూ. 2.41 కోట్లు, ఐయూఎమ్ఎల్​ రూ. 2.06 కోట్లు వ్యయం చేయని ఆదాయంగా ప్రకటించాయి.

15 పార్టీలు మాత్రం ఆదాయం కంటే ఎక్కువగా వ్యయం చేశాయి.

స్వచ్ఛంద విరాళాలు...

ఎన్నికల బాండ్లు, విరాళాలను స్వచ్ఛంద విరాళాల విభాగంలో పరిగణిస్తారు. పార్టీలన్నీ పొందిన ఆదాయంలో వీటి వాటా 32.58 శాతం( రూ. 77.30 కోట్లు). జేడీఎస్​ మాత్రమే ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని(రూ. 6.03 కోట్లు) ప్రకటించింది.

ఐటీ రిటర్నులు​ సమర్పించని పార్టీలకు పన్ను మినహాయింపు ఇవ్వకూడదని ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు చేసింది ఏడీఆర్​.

Mumbai, Mar 08 (ANI): Mark your calendars, Kangana Ranaut starrer 'Panga' has finally got its release date. The film is all set to hit theatres on January 24, 2020. Indian Film Critic and Trade Analyst Taran Adarsh took to Twitter to make an announcement. Kangana will be seen playing the role of a kabbadi player in the upcoming film. Meanwhile, Kangana was last seen in "Manikarnika: The Queen of Jhansi" as a warrior queen Rani Laxmi Bai.

Last Updated : Mar 8, 2019, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.