ETV Bharat / bharat

లైవ్​: 'అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తాం' - హాథ్రస్​ లైవ్​ అప్​డేట్స్​

Tension in Hathras amid Rahul Gandhi's visit, live updates
మరోమారు హాథ్రస్​కు రాహుల్​- ప్రియాంక
author img

By

Published : Oct 3, 2020, 3:00 PM IST

Updated : Oct 3, 2020, 8:29 PM IST

20:26 October 03

అప్పటి వరకు పోరాటం ఆగదు'

హాథ్రస్​ బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. బాధితురాలి చివరి చూపు కూడా కుటుంబ సభ్యులకు దక్కలేదన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​.. తన బాధ్యతలను అర్థంచేసుకోవాలని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

19:55 October 03

హాథ్రస్​లో రాహుల్​

ఉద్రిక్తతల మధ్య కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాథ్రస్​కు చేరుకున్నారు. అనంతరం హాథ్రస్​ హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

19:27 October 03

హథ్రస్​ చేరుకున్న రాహుల్​ బృందం

  • హాథ్రస్ చేరుకున్న రాహుల్, ప్రియాంకగాంధీ
  • బాధితురాలి కుటుంబానికి రాహుల్‌, ప్రియాంక పరామర్శ
     
18:51 October 03

రాహుల్​ గాంధీ బృందం హాథ్రస్​కు మరికొద్ది సేపట్లో చేరుకోనుంది. ప్రస్తుతం రాహుల్​ బృందం మథురలో ఉంది. 

అంతకుముందు.. దిల్లీ-నోయిడా వంతెనపై కాంగ్రెస్​ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. అక్కడే ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.

16:51 October 03

కాసేపట్లో హాథ్రస్​కు రాహుల్​

  • కాసేపట్లో హాథ్రస్‌ చేరుకోనున్న రాహుల్‌గాంధీ, ప్రియాంక
  • హాథ్రస్‌ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించనున్న రాహుల్‌, ప్రియాంక
  • రాహుల్, ప్రియాంక వెంట అధిర్ రంజన్ చౌదరి, కేసీ వేణుగోపాల్‌
  • హాథ్రస్‌లో 144 సెక్షన్‌ కొనసాగుతున్నట్లు పోలీసు అధికారుల వెల్లడి

16:29 October 03

వంతెన వద్ద ఉద్రిక్తత

దిల్లీ-నోయిడా వంతెన వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్​ గాంధీని హాథ్రస్​ పర్యటనకు అనుమతినిచ్చినప్పటికీ.. కాంగ్రెస్​ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

16:02 October 03

రాహుల్​కు అనుమతి

ఉత్కంఠ మధ్య రాహుల్​ గాంధీ హాథ్రస్​ పర్యటనకు అనుమతి లభించింది. అయితే కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతినిచ్చింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు రాహుల్​ గాంధీ, ప్రియాంకతో పాటు మరో ముగ్గురు హాథ్రస్​కు చేరుకోనున్నారు.

15:53 October 03

దిల్లీ-నోయిడా వంతెన​

హాథ్రస్​ పర్యటనలో భాగంగా రాహుల్​ గాంధీ బృందం దిల్లీ-నోయిడా వంతెన వద్దకు చేరుకుంది. ఆ ప్రాంతంలో ఇప్పటికే పోలీసులు బలగాలను మోహరించడం వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాహుల్​ బృందాన్ని పోలీసులు ఏ నిమిషంలోనైనా అడ్డుకునే అవకాశముంది.

15:46 October 03

'రాజకీయ లబ్ధి కోసమే...'

రాహుల్​ గాంధీ హాథ్రస్​ పర్యటనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. రాహుల్​ పర్యటన కేవలం రాజకీయ లబ్ధికోసమేనని... బాధితురాలి కుటుంబానికి జరగాల్సిన న్యాయంతో ఆయనకు ఎలాంటి పని లేదని విమర్శించారు.

15:30 October 03

రాకపోకలు నిలిపివేత

  • దిల్లీ, యూపీ సరిహద్దులో గేట్లు మూసివేసిన పోలీసులు
  • దిల్లీ-నోయిడా వంతెన వద్ద రాకపోకలు పూర్తిగా నిలిపివేసిన అధికారులు
  • హాథ్రస్‌కు వెళ్లేందుకు నేతలకు అనుమతి లేదు: యూపీ పోలీసులు

  • ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తేనే నేతలకు అనుమతి: పోలీసులు

15:13 October 03

రాహుల్​ పర్యటనతో

రాహుల్​ గాంధీ హాథ్రస్​ పర్యటనను అడ్డుకునేందుకు ఇప్పటికే అన్ని చర్యలను చేపట్టారు పోలీసులు. తాజాగా.. యూపీసీసీ అధ్యక్షుడు అజయ్​ కుమార్​ లల్లూను ఆయన నివాసంలో నిర్బంధించినట్టు తెలుస్తోంది. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు చేరారని... ఆయనను బయటకి రానివ్వకుండా చేస్తున్నారని కాంగ్రెస్​ ఆరోపించింది. 

15:02 October 03

వారిని కలిసేంతవరకు ఆగము...

హాథ్రస్​ పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడారు ప్రియాంక గాంధీ. బాధితురాలి కుటుంబాన్ని కలిసేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమని ఈసారి కూడా కలవనివ్వకపోతే... మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు.

14:49 October 03

మరోమారు హాథ్రస్​కు రాహుల్​- ప్రియాంక

  • కారులో హాథ్రస్‌ బయల్దేరిన రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ
  • 2 బస్సుల్లో హాథ్రస్‌ బయల్దేరిన కాంగ్రెస్‌ ఎంపీల బృందం
  • హాథ్రస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నామన్న రాహుల్‌
  • బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చకుండా తనను ఏ శక్తీ అడ్డుకోలేదన్న రాహుల్
  • కాంగ్రెస్ ఎంపీల బృందంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి

Last Updated : Oct 3, 2020, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.