భారత్‌లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కొవిడ్ కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కరోజులో 9వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. మరో 200పైగా మరణించారు. తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు బిహార్, బంగాల్, కేరళల్లోనూ కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
మహాలో వైరస్ విలయతాండవం..
మహారాష్ట్రలో తీవ్ర స్థాయిలో వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 9,251కేసులు బయటపడ్డాయి. మరో 257 మంది చనిపోయారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,66,368కు ఎగబాకింది. 2,07,194 మంది కోలుకున్నారు. 1,45,481 మంది చికిత్స పొందుతున్నారు.
రెండు లక్షలు దాటిన బాధితులు
తమిళనాడులో కరోనా కోరలు చాస్తోంది. కొత్తగా 6,988 మంది వైరస్ బారిన పడగా... 89మంది మరణించారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,06,737కు చేరింది. వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య 3,409కు పెరిగింది. 1,51,055 మంది కొవిడ్‌ను జయించారు. 52,273 మంది చికిత్స పొందుతున్నారు.
కర్ణాటక విలవిల..
కర్ణాటకలో కరోనా విస్తరణ కొనసాగుతోంది. ఒక్కరోజే 5,072కు మందికి వైరస్ సోకగా..72మంది మత్యువాత పడ్డారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 90,942కు చేరగా.. 1,796కు పెరిగింది.
ఒక్కరోజే 3వేలకు చేరువలో..
ఉత్తర్‌ప్రదేశ్‌లో వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజే 2,971 కేసులు బయటపడ్డాయి. 39 మంది కొవిడ్‌కు బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,742కు ఎగబాకింది. కాగా 1,387 మంది మరణించారు.
బంగాల్లో..
పశ్చిమబంగాలో కొత్తగా 2,404 మంది కరోనా బారిన పడ్డారు. 42 మంది వైరస్‌తో మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 56,377కు ఎగబాకింది. మరణాల సంఖ్య 1,332కు పెరిగింది.
బిహార్‌లో కరోనా కలవరం..
బిహార్‌లో కొత్తగా 2,803 వెలుగుచూశాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 36,314 మంది వైరస్ బారినపడ్డారు.
రాజధాని దిల్లీలో..
దిల్లీలో తాజాగా 1,142 మందికి వైరస్ సోకింది. మరో 29మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,29,531చేరగా.. మరణాల సంఖ్య 3,806కు పెరిగింది. మరో 2,137మంది కొవిడ్ నుంచి కోలుకోగా... వైరస్‌ను జయించిన వారి సంఖ్య 1,13,068 చేరింది.
కేరళలో వెయ్యికి పైగా..
కేరళలో కొత్తగా 1,103 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కాగా ముగ్గురు మరణించారు. ఫలితంగా మృతుల సంఖ్య 60కు పెరిగింది.
ఇదీ చూడండి: 'కార్గిల్' విజయ గర్వానికి 21 ఏళ్లు