తమిళనాడు చెన్నైలోని టీనగర్లో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఓ షాపింగ్ మాల్‌కు సీలు వేశారు చెన్నై కార్పొరేషన్ అధికారులు. టీ నగర్‌లోని కుమారన్ సిల్క్స్ మాల్ కరోనా నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో వినియోగదారులకు ప్రవేశం కల్పించి... భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించింది.


ఈ మేరకు సమాచారం అందుకున్న కార్పొరేషన్ అధికారులు... మాల్ వద్దకు చేరుకొని, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా షాపు యాజమాన్యం వ్యవహరించిందని నిర్ధరించుకొని అధికారులు సీల్ వేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: దేశంలో తగ్గిన యాక్టివ్ కేసులు- భారీగా పెరిగిన రికవరీలు