తబ్లీగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌పై హత్య కేసు నమోదైంది. జమాతే కార్యక్రమానికి హాజరైన వారిలో కొందరు కరోనా సోకి మృతి చెందారు. ఫలితంగా ఆయనపై ఐపీసీ సెక్షన్-304 ప్రకారం హత్య కేసు నమోదు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందకు కేంద్రం విధించిన భౌతిక దూరం నిబంధనలకు వ్యతిరేకంగా మౌలానా సాద్.. గత నెల నిజాముద్దీన్ మర్కజ్ భవనంలో మతపరమైన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి వేలాది మంది హాజరయ్యారు. వీరిలో కొంత మందికి కరోనా ఉండటం వల్ల.. వారి నుంచి దేశ వ్యాప్తంగా హాజరైన అనేక రాష్ట్రాల జమాత్ సభ్యులకు కూడా వైరస్ సోకింది.
ఈ ఘటన అనంతరం.. తాను స్వీయ నిర్భంధంలోకి వెళ్తున్నట్లు మౌలనా సాద్ ప్రకటించారు. ఇప్పటికే ఆయనపై క్వారంటైన్ సమయం పూర్తి కాగా.. విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీచేశారు.
ఇదీ చదవండి: 'తబ్లీగీ'ని దాచిన నేత- ఒక్కరి నిర్లక్ష్యానికి ఊరంతటికీ శిక్ష