ETV Bharat / bharat

'తబ్లీగీ'ని దాచిన నేత- ఒక్కరి నిర్లక్ష్యానికి ఊరంతటికీ శిక్ష

author img

By

Published : Apr 11, 2020, 11:16 AM IST

దిల్లీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తబ్లీగీ ప్రార్థనల్లో పాల్గొని... ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేయకుండా నిర్లక్ష్యం వహించారు. దీనితో ఆయన కుటుంబమంతా కరోనా బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ ఒక్కడి నిర్లక్ష్యంతో... ఆ ఊరినంతా కంటైన్​మెంట్ జోన్​గా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

a case filed aginst Congress Leader Who Hid Delhi Mosque Visit
తబ్లీగీ విషయాన్ని దాచిపెచ్చిన దిల్లీ కాంగ్రెస్ నేతపై కేసు నమోదు

నిజాముద్దీన్‌ మర్కజ్‌ తబ్లీగీ జమాత్‌ సమ్మేళనంలో పాల్గొన్న విషయాన్ని దాచిన దిల్లీ కాంగ్రెస్‌ నేత, మాజీ కౌన్సిలర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకు ముందు ఆయన్ను పోలీసులు పదేపదే ప్రశ్నించినప్పటికీ మర్కజ్‌ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఇప్పుడు ఆయనతో పాటు అతని భార్య, కుమార్తెకు కూడా కొవిడ్‌-19 సోకినట్లు నిర్ధరణ కావడం కలకలం రేపుతోంది.

ఒక్కరి నిర్లక్ష్యంతో ఊరంతా లాక్‌డౌన్‌

ప్రస్తుతం ఆ వ్యక్తి సతీమణి కౌన్సిలర్‌గా సేవలందిస్తున్నారు. వైరస్‌ సోకిన ఈ ముగ్గురినీ అంబేడ్కర్‌ ఆసుపత్రిలో చేర్చామని పోలీసులు మీడియాకు తెలిపారు. ఒక్కరి నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు దక్షిణ దిల్లీలోని దీన్‌పుర్‌ గ్రామం మొత్తాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించాల్సి వచ్చిందని అంటున్నారు. అంటే నిత్యావసరాలకు సైతం ప్రజలు బయటకు రావడానికి వీల్లేదు. ప్రభుత్వమే వారికి అన్నీ సమకూరుస్తుంది.

కాల్​ రికార్డుల సాయంతో...

'గత నెలలో నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లారా? అని ఆరా తీయగా ఆయన విషయాన్ని దాచిపెట్టారు. అప్పుడాయనలో లక్షణాలేమీ కనిపించలేదు. కానీ సాంకేతికంగా దర్యాప్తు చేయగా తబ్లీగీ జమాత్‌తో ఆయనకున్న సంబంధం బయటపడింది. ఆయన్ను ఇంట్లోనే క్వారంటైన్‌ చేశాం. మరోసారి తనిఖీకి వెళ్లినప్పుడు ఆయన ఇంట్లో కనిపించలేదు. ఎన్నిసార్లు అడిగినా నిజం చెప్పకుండా తప్పుంచుకున్నారు. దీనితో కాల్‌ రికార్డులను పరిశీలించాం. అప్పుడు ఆయన మర్కజ్‌కు వెళ్లిన సంగతి బయటపడింది'’ అని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: 7 వేలు దాటిన కేసులు- ఒక్కరోజులో 40మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.