ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రిగా చౌహానే ఎందుకంటే? - madhya pradesh cm

మధ్యప్రదేశ్​లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో పాగా వేసింది. ముఖ్యమంత్రిగా శివరాజ్​సింగ్ చౌహాన్​ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. అయితే సీఎం అభ్యర్థిగా అధిష్ఠానం ఆయన్నే ఎంచుకోవడానికి కారణం ఏంటి? కేంద్రమంత్రి నరేంద్రసింగ్​ తోమర్, రాష్ట్ర మాజీ మంత్రి నరోత్తమ్​ మిశ్రాలను కాదని .. చౌహాన్​కే పగ్గాలు అప్పగించేందుకు అధిష్ఠానం మొగ్గుచూపడానికి కారణాలు ఏంటి?

Swearing-in of BJP ministry in Madhya Pradesh at 9 pm
మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రిగా చౌహానే ఎందుకంటే..!
author img

By

Published : Mar 23, 2020, 10:54 PM IST

Updated : Mar 24, 2020, 12:38 AM IST

ఎమ్మెల్యేల మాయం, రాజీనామాలు, రాజకీయ సంక్షోభం లాంటి అనూహ్య పరిణామాల తర్వాత మధ్యప్రదేశ్​ సీఎం కమల్​నాథ్​ రాజీనామా చేశారు. కమల్​నాథ్​ రాజీనామా చేయడం వల్ల రాష్ట్రంలో భాజపా సర్కారు కొలువుదీరేందుకు మార్గం సుగమమైంది.

అయితే భాజపా అధిష్ఠానం ముందుగా ఈ పదవికి ఎవరి పేరునూ ప్రతిపాదించలేదు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి భాజపా సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపైనే పడింది. శివరాజ్​ సింగ్​ చౌహాన్​... మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి. ఇదివరకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. చివరకు మరోసారి ఆయనే రాష్ట్ర సీఎం పీఠాన్ని అధిరోహించారు.

ముందుగా ఈ పదవికి కేంద్రమంత్రి నరేంద్రసింగ్​ తోమర్​, రాష్ట్ర మాజీ మంత్రి నరోత్తమ్​ మిశ్రా పేర్లు వినిపించాయి. కానీ పార్టీలో చాలామంది అనుకున్నట్లు అధిష్ఠానం మాత్రం శివరాజ్​ వైపే మొగ్గుచూపింది. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి.

ఆయనని మించిన నేత లేరు!

రాష్ట్రంలో చౌహాన్​ కన్నా ప్రజాకర్షక నేత భాజపాలో లేరు. ఆయనకు ఆర్​ఎస్​ఎస్​తో మంచి సంబంధాలు ఉన్నాయి. శివరాజ్​ నాయకత్వంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ.. కాంగ్రెస్​ కన్నా ఎక్కువ ఓట్లను సాధించింది. 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో త్వరలో రాష్ట్రంలో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి శివరాజ్​ను మించిన నేత లేరని పార్టీలో చాలా మంది విశ్వసిస్తున్నారు.

13 ఏళ్ల పాలన

నిమ్న వర్గాల నుంచి వచ్చి రాష్ట్ర సీఎంగా 2018 వరకు వరుసగా 13 సంవత్సరాలు చౌహాన్​ పాలించారు. ఇటీవల పలు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ఎదురీదిన నేపథ్యంలో స్థానికంగా పట్టున్న నాయకులకు పదవులు ఇచ్చి ప్రోత్సహించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని చౌహాన్​కు అప్పజెప్పింది భాజపా అధిష్ఠానం. కాంగ్రెస్​కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు​ రాజీనామాలు చేసిన వెంటనే రాజకీయ వ్యూహాన్ని పక్కాగా అమలు చేశారు చౌహాన్​.

వీటన్నింటి కారణంగానే మరోసారి మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రిగా శివరాజ్​ సింగ్​కు అవకాశం దక్కిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:కేరళలో 28 కొత్త కేసులు.. దేశవ్యాప్తంగా 9 మంది మృతి

Last Updated : Mar 24, 2020, 12:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.