దివంగత నేత సుష్మా స్వరాజ్ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేడు ఆమె 68వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ప్రజాసేవలో నిబద్ధత కలిగిన వ్యక్తిగా పేర్కొంటూ ట్వీట్ చేశారు.
విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా.. భారతీయ విలువలకు నిలువెత్తు రూపమని..దేశాభివృద్ధి కోసం కలలు కనేవారని కొనియాడారు ప్రధాని. ఆమె అసాధారణమైన సహచరురాలని.. ఉత్తమ మంత్రిగా పేర్కొన్నారు.
సుష్మా స్వరాజ్ భవన్..
సుష్మా స్వరాజ్ జయంతిని పురస్కరించుకుని.. దిల్లీలోని సాంస్కృతిక కేంద్రం ప్రవాసి భారతీయ కేంద్రకు 'సుష్మా స్వరాజ్ భవన్'గా నామకరణం చేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే దౌత్యవేత్తలకు శిక్షణ ఇచ్చే విదేశీ సేవల సంస్థ ( ఫారెన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ )కి కూడా 'సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ సర్వీస్' గా పేరు మార్చారు.
గతేడాది ఆగస్టు 6న గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు సుష్మా.
ఇదీ చూడండి: 'మహోన్నత వ్యక్తిత్వం సుష్మాస్వరాజ్ సొంతం'