ETV Bharat / bharat

'జూమ్'​ బ్యాన్​పై మీరు ఏమంటారు?: కేంద్రానికి సుప్రీం

వీడియో సమావేశాలకు వేదికగా మారిన 'జూమ్‌' యాప్‌ నిషేధంపై తమ అభిప్రాయం తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. వ్యక్తిగత భద్రతకు ఈ యాప్​తో ముప్పుందని దాఖలైన పిటిషన్​పై విచారణ చేపట్టింది అత్యున్నత న్యాయస్థానం. నాలుగు వారాల్లో కేంద్రం పిటిషనర్​ వ్యాజ్యానికి సమాధానమివ్వాలని చెప్పింది.

Supreme Court zoom app
'జూమ్'​ విషయంలో మీ అభిప్రాయం చెప్పాలి: సుప్రీం
author img

By

Published : May 22, 2020, 3:47 PM IST

తగిన చట్టాన్ని తీసుకువచ్చే వరకు అధికారిక, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వీడియో కమ్యూనికేషన్ యాప్ 'జూమ్' వాడకాన్ని నిషేధించాలన్న పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. నిషేధించాలన్న అభ్యర్థనపై 4 వారాల్లోగా అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది.

పిటిషనర్​ వాదన ఇదే..

జూమ్​ యాప్​ సైబర్​ దాడులకు కారణమవుతోందని, దీనితో దేశ భద్రతకే ముప్పు పొంచి ఉందని ఆరోపించారు పిటిషనర్​.

" కొవిడ్​-19 తర్వాత పరిస్థితులు మారుతున్నాయి. వినియోగదారులు, వ్యాపారులు, విద్యాలయాలు ఆన్​లైన్​పై ఎక్కువ దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో జూమ్​ కోట్లాది మంది యూజర్ల డేటాకు భద్రత కల్పించలేకపోతోంది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తన సొంత సర్వర్లలో దాచి స్వప్రయోజనాలకు వాడుకుంటోంది."

--హర్ష్​ చౌ, పిటిషనర్​

"జూమ్​లో చిన్నపాటి బగ్​ ఉంది. దాని వల్ల యూజర్ల డేటాను ఎలాంటి అనుమతి లేకుండా మధ్యవర్తులు యాక్సెస్​ చేయగలరు. కాలింగ్​ సదుపాయంలోనూ ఎండ్​ టూ ఎండ్​ ఎన్​క్రిప్సన్​ వాడుతున్నట్లు తొలుత సంస్థ అబద్ధాలు చెప్పింది. ఇటీవల భద్రతా లోపాలున్నాయని సంస్థ ప్రతినిధులు క్షమాపణ కూడా చెప్పారు. ఈ యాప్​ను చైనా ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది" అని పిటిషనర్​ పేర్కొన్నారు.

ఇప్పటికే ఆదేశాలు...

జూమ్‌ యాప్‌లో భద్రతా సమస్యలు వస్తున్నాయని ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌ సహా చాలా సంస్థలు నిషేధించాయి. ఇటీవల ప్రభుత్వం కూడా దానిపై దృష్టి సారించింది. జూమ్‌ వాడితే సైబర్‌ దాడులు‌ జరిగే అవకాశం ఎక్కువని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ-ఐఎన్‌) తేల్చింది. వినియోగదారుని వ్యక్తిగత సమాచారానికి జూమ్‌లో భద్రత లేదని స్పష్టం చేసింది. దీంతో జూమ్‌ను వినియోగించొద్దని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

  • ఇవీ చూడండి:

'జూమ్​' యాప్​ ఎందుకు సురక్షితం కాదంటే...!

'జూమ్‌' వాడకంపై ప్రభుత్వం ఎందుకు నిషేధం విధించింది?

జూమ్​లో సుప్రీంకోర్టు విచారణ.. నిందితుడికి ఉరిశిక్ష!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.