ETV Bharat / bharat

బాత్రూంకని చెప్పి ఈడీ ఆఫీస్ నుంచి బయటకు!

అగస్టా వెస్ట్​ల్యాండ్​ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్​నాథ్ మేనల్లుడు రతుల్ పూరీ నాటకీయంగా ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి బయటపడ్డారు. కాసేపటికే... ఈడీ తనను అరెస్టు చేయకుండా దిల్లీ కోర్టు నుంచి రక్షణ పొందారు.

బాత్రూంకని చెప్పి ఈడీ ఆఫీస్ నుంచి బయటకు!
author img

By

Published : Jul 27, 2019, 7:40 PM IST

అగస్టా వెస్ట్​ల్యాండ్ కేసులో మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్ మేనల్లుడు రతుల్ పూరీని ప్రశ్నించడంలో నాటకీయ పరిణామాల మధ్య విఫలమైంది ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్. ఈడీ కార్యాలయానికి చేరుకున్న రతుల్​ను కొద్ది సమయం వేచి చూడాలని కోరగా బాత్రూంకు వెళ్లే నెపంతో ఆయన బయటపడ్డారని సమాచారం.

రతుల్​ను కొన్ని ఆధారాలతో ప్రశ్నించాలని భావించామని... కానీ ఆయన వెళ్లిపోయిన కారణంగా కుదరలేదని ఈడీ అధికారులు తెలిపారు. రతుల్​ను వెనక్కి రప్పించేందుకు ఫోన్​ చేయగా అతడి చరవాణిని స్విచ్చాఫ్ చేశారని సమాచారం.

నాటకీయంగా ఈడీ కార్యాలయం నుంచి బయటపడిన రతుల్ దిల్లీ కోర్టును ఆశ్రయించి.... అరెస్ట్​ నుంచి మినహాయింపు కోరారు. సోమవారం వరకు ఆయన్ను అరెస్టు చేయరాదని కోర్టు ఈడీని ఆదేశించింది.

ఎవరు ఈ రతుల్?

కమల్​నాథ్ సోదరి నీతా పూరీ కుమారుడు రతుల్. ప్రస్తుతం హిందుస్థాన్ పవర్ ప్రాజెక్ట్స్ ఛైర్మన్​గా ఉన్నారు. వీరి కుటుంబమే మ్యూజిక్ ఆల్బమ్స్​ వ్యాపార సంస్థ మోసర్​ బేర్​ను నిర్వహిస్తోంది.

ఇదీ చూడండి: డబుల్​ ధమాకా​: భార్యాభర్తలు పరీక్షల్లో టాప్

AP Video Delivery Log - 1300 GMT News
Saturday, 27 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1219: Hong Kong Protest 3 AP Clients Only 4222409
Tear gas as protesters and police face off in HKong
AP-APTN-1204: Russia Arrests AP Clients Only 4222407
Police detain activists ahead of planned Moscow demo
AP-APTN-1159: Italy Orlandi Case AP Clients Only 4222406
Rome forensic team study bones for link to Orlandi case
AP-APTN-1124: India Flooded Train AP Clients Only 4222403
Passengers rescued from flooded train in India
AP-APTN-1114: Tunisia President AP Clients Only 4222401
Tunis residents saddened by president's death
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.