ETV Bharat / bharat

2048 నాటికి 160 కోట్లు- 2100కి 109 కోట్ల జనాభా! - indian population

భారత జనాభా 2048 నాటికి 160 కోట్లకు చేరుకుంటుందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తల అధ్యయనం పేర్కొంది. అయితే క్రమంగా ఈ జనాభా తగ్గి... 2100 నాటికి 109 కోట్లకు పరిమితమవుతుందని అంచనా వేసింది. అలాగే ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచంలో ఆధిపత్య దేశాల సంఖ్య పెరిగి.. ప్రపంచం మల్టీపోలార్​గా అవతరిస్తుందని అంచనా వేసింది. భారత్​, నైజీరియా, చైనా, అమెరికా ఆధిపత్య శక్తులుగా ఉంటాయని పేర్కొంది.

Study predicts India's population may peak to 1.6 bn in 2048, decline in 2100 to 1.09 bn
2048 నాటికి భారత జనాభా 160 కోట్లు!
author img

By

Published : Jul 16, 2020, 10:08 AM IST

దేశ జనాభా 2048 నాటికి గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉంది. నాటికి సుమారు 160 కోట్లకు చేరి ఆ తర్వాత క్రమంగా తగ్గనుందట. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తల అధ్యయనం లాన్సెట్ జర్నల్​లో ప్రచురితమైంది. ఈ శతాబ్ది రెండో భాగంలో భారత్ జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. 2048తో పోలిస్తే 2100 నాటికి దేశ జనాభా 32 శాతం తగ్గి 109 కోట్లకే పరిమితమవుతుంది. అయినప్పటికీ ప్రపంచంలో అధిక జనాభా ఉన్న దేశంగానే నిలుస్తుందని అధ్యయనం పేర్కొంది.

చైనాను అధిగమించనున్న భారత్​

భారత్​లో పనిచేసే వయసున్న జనాభా 2017లో 76.2 కోట్లు ఉండగా... 2100 నాటికి 57.8 కోట్లకు తగ్గుతుంది. ఇదే సమయంలో చైనాలో 95 కోట్ల నుంచి 35.7 కోట్లకు తగ్గిపోతారు. ఆసియాలోని కొన్ని ప్రధాన శక్తుల్లో భారత్ ఒకటిగా నిలుస్తుంది. అయితే శతాబ్దం చివరి వరకు యువ జనాభాను కాపాడుకోగలగాలి. పనిచేసే వయసున్న జనాభా సంఖ్యలో 2020 మధ్యలోనే చైనాను భారత్ అధిగమిస్తుండడం గమనార్హం.

నాలుగో స్థానానికి అమెరికా

ప్రపంచ జనాభా సైతం ఈ శతాబ్ది రెండో అర్ధభాగం తర్వాత తగ్గిపోనుంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు, 195 దేశాల్లోని మరణాలు, జననాలు, వలసల రేటును పరిగణనలోకి తీసుకున్నాక ఈ అంచనాకు వచ్చినట్లు అధ్యయనం పేర్కొంది. ప్రస్తుత అగ్రరాజ్యం అమెరికా జనాభా 2062 నాటికి 36.4 కోట్లకు చేరుతుంది. 2100 నాటికి 33.6 కోట్లకు పరిమితమై అత్యధిక జనాభా దేశాల్లో నాలుగో స్థానంలో నిలుస్తుంది. అది కూడా ఆ దేశంలోకి వలస వచ్చే వారితోనే సాధ్యమవుతుంది. అయితే ఇంతకాలంగా అమెరికాలో ఉన్న ఉదార వలస విధానాలు ఇటీవల కాలంలో రాజకీయ రంగు పులుముకున్న.. ఫలితంగా ఆ దేశ జనాభా, ఆర్థిక వృద్ధిని కొనసాగించే సామర్థ్యం తగ్గుతుందని అధ్యయనం హెచ్చరించింది. 2100 నాటికి ప్రపంచ జనాభాలో 65 ఏళ్లు దాటిన వారు 2.37 బిలియన్లు ఉంటే, 20 ఏళ్ల లోపువారు కేవలం 1.7 బిలియన్లే ఉంటారని అంచనా.

బహుళ ధృవ ప్రపంచం

ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచం బహుళ ధృవంగా ఉంటుందని అధ్యయనం అంచనా వేసింది. ప్రపంచాన్ని శాసించే శక్తి కేవలం ఎదో ఒక్క దేశానికి పరిమితం కాకుండా.. మరిన్ని దేశాలు శక్తిమంతమవుతాయని పేర్కొంది. ముఖ్యంగా భారత్​, నైజీరియా, చైనా, అమెరికా ఆధిపత్య శక్తులుగా ఉంటాయని అంచనా వేసింది.

"ఇది నిజంగా కొత్త ప్రపంచం అవుతుంది. ఆ రోజు కోసం మనం సిద్ధంగా ఉండాలి." - అధ్యయనం

కొవిడ్ ప్రభావం?

కరోనా మహమ్మారి కలిగిస్తున్న ప్రాణనష్టం... ప్రపంచ జనాభా దీర్ఘకాలిక అంచనా పోకడలను గణనీయంగా మార్చే అవకాశమే లేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: తొలి అణ్వస్త్ర పరీక్ష 'ట్రినిటీ'కి 75 ఏళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.