ETV Bharat / bharat

ట్రెండింగ్​: పరీక్షలు రద్దు చేయండి ప్లీజ్​! - Promote All College Students Jokes

దేశం మొత్తం కరోనా పరీక్ష ఎదుర్కొంటున్న సమయంలో.. విద్యార్థులు తమ పరీక్షల గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమ జీవితం సందిగ్ధంలో పడిందంటూ సోషల్​ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది యువతీయువకులు.

exams in india
పరీక్షల రద్దు
author img

By

Published : Jun 14, 2020, 2:22 PM IST

విద్యార్థులు పైతరగతులకు వెళ్లాలంటే మనదేశంలో పరీక్షలు తప్పనిసరి. పరీక్షా కాలం వచ్చిందంటే రాత్రీపగలూ తేడా లేకుండా తెగ చదివేస్తారు. ప్రస్తుతం కరోనా వల్ల ఆ పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. కొవిడ్​-19 దెబ్బకు విద్యాసంస్థలన్నీ దాదాపు మూడు నెలలుగా మూతపడే ఉన్నాయి. అయితే వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ, తమిళనాడు పది విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్​ చేయగా.. మహారాష్ట్ర ఏకంగా ఉన్నత విద్యార్థులకూ ఈ ఆఫర్​ ఇచ్చింది. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం పరీక్షల విషయంలో ఎటువంటి నిర్ణయం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో తమ జీవితం సందిగ్ధంలో పడిందని.. ఎగ్జామ్స్​ రద్దు చేయాలని కొందరు యువత సోషల్​ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణలో..

పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతికి పంపాలని ఇటీవల నిర్ణయించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. అంతర్గత మార్కుల ఆధారంగా వారికి గ్రేడ్లు కేటాయించి పదో తరగతి సర్టిఫికెట్‌ అందజేయాలన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ, పీజీ పరీక్షల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఆంధ్రప్రదేశ్​లో మాత్రం జులై 10 నుంచి పది పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తమిళనాడులో..

తమిళనాడులో 10, 11 తరగతుల పరీక్షలు రద్దు చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. పళనిస్వామి. అర్ధవార్షిక, త్రైమాసిక పరీక్షల ఫలితాలు, హాజరు శాతం ఆధారంగా విద్యార్థులను పైతరగతులకు పంపిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం కుదిరే పని కాదని తేల్చిచెప్పారు. 12వ తరగతి పరీక్షల నిర్వహణపై ఈ రాష్ట్రంలోనూ సందిగ్ధం నెలకొంది.

మహారాష్ట్రలో వారికే..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులను ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది మహారాష్ట్ర ప్రభుత్వం. వివిధ యూనివర్సిటీల పరిధిలోని అన్ని కాలేజీలకు తమ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. అయితే, అన్ని కోర్సుల ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు మాత్రం పరీక్షలు రాయాల్సిందేనని జులైలో పరీక్షలు రాయాల్సిందేనని స్పష్టం చేసింది.

లేఖ కూడా...!

వైద్యవిద్య పీజీ పరీక్షలనూ వాయిదా వేయాలని తెలంగాణలోని ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన ఓ వైద్య విద్యార్థి.. ఏకంగా గవర్నర్‌కు లేఖ రాసి గోడు వెళ్ల బోసుకున్నాడు. కరోనా బాధితులకు వైద్యం అందిస్తూ బిజీగా ఉండటం వల్ల పరీక్షలు రాయలేమని స్పష్టం చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.