ETV Bharat / bharat

'ర్యాపిడ్'​లో నెగెటివ్ వస్తే మళ్లీ టెస్టు తప్పనిసరి! - symptomatic RAT negative cases

భారత్​లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 95,735 కేసులు వెలుగుచూశాయి. మరో 1,172 మంది మరణించారు. కొవిడ్​ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేసింది ఐసీఎంఆర్​. లక్షణాలు ఉన్నవారికి ర్యాపిడ్​లో నెగెటివ్​ వస్తే మళ్లీ టెస్టు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

RAT negative cases
ర్యాపిడ్​లో నెగెటివ వస్తే.. మళ్లీ టెస్టు చేయాల్సిందే
author img

By

Published : Sep 10, 2020, 4:10 PM IST

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా టెస్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఐసీఎంఆర్​. లక్షణాలు ఉండి.. ఆర్​టీ-పీసీఆర్​ ద్వారా చేసే ర్యాపిడ్​ యాంటీజెన్​ టెస్టుల్లో నెగెటివ్​ వస్తే మళ్లీ పరీక్ష చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది​. అప్పుడు పాజిటివ్​ కొవిడ్-​19 కేసులను మరింత బాగా గుర్తించవచ్చని.. తద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తోంది.

రెండు రోజుల తర్వాత చేయాల్సిందే..

జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉంటే ర్యాపిడ్​ టెస్టులు చేస్తారు. వాటిల్లో నెగెటివ్​ వస్తే మళ్లీ ఆర్​టీ-పీసీఆర్​ టెస్టు చేయాలి. లక్షణాలు లేని వారికి ర్యాపిడ్​ టెస్టుల్లో నెగెటివ్​ వచ్చినా.. టెస్టు చేసిన రెండు రోజుల తర్వాత మళ్లీ ఆర్​టీ-పీసీఆర్​ టెస్టులు చేయాలి. కానీ ఈ రెండు సందర్భాల్లోనూ అలా జరగట్లేదు. అందుకే దీనిపై ఐసీఎంఆర్​ దృష్టి సారించింది.

ప్రత్యేక బృందాలు..

నూతన మార్గదర్శకాల అమలును పర్యవేక్షించేందుకు.. ప్రత్యేక అధికారి లేదా బృందాలను ప్రతి రాష్ట్రం, జిల్లాలో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఇలాంటి కేసుల విషయంలో ఫాలో అప్​ చేయటం కోసం ఈ బృందాలు పనిచేయనున్నాయి. ప్రతి ప్రాంతంలో రోజువారీగా జరిగే ర్యాపిడ్​ యాంటీజెన్​ టెస్టులను విశ్లేషించనున్నాయి. ఎటువంటి ఆలస్యం లేకుండా లక్షణాలు ఉండే నెగెటివ్​ కేసుల్లో టెస్టులను చేసే విధంగా పర్యవేక్షణ చేయనున్నారు ఈ ప్రత్యేకాధికారులు.

కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పరీక్షల సామర్థ్యం పెంచేందుకు మాత్రమే ర్యాపిడ్​ను వినియోగిస్తుతున్నారు. అయితే కచ్చితమైన ఫలితాలు తెలుసుకునేందుకు ఆర్​టీ-పీసీఆర్​ టెస్టులు కీలకమైనవి.

భారత్​లో బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 95,735 కేసులు, 1172 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసులు 44,65,863కు చేరగా.. మరణించిన వారి సంఖ్య 75,062గా నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారు 34,71,738 మంది ఉన్నారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.