తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వస్తే విద్యా రుణాలను మాఫీ చేస్తామని ఆ పార్టీ అధినేత స్టాలిన్ హామీ ఇచ్చారు. తూర్పు ఈరోడ్ నియోజకవర్గంలోని వి.మెట్టుపాళ్యం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఈమేరకు ప్రకటించారు.
అవినీతి ప్రభుత్వం..
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని.. బోధనా ప్రమాణాలు సైతం పడిపోతున్నాయని ఆరోపించారు స్టాలిన్. ప్రస్తుత ఏఐఏడీఎంకే ప్రభుత్వం అవినీతికి మారుపేరుగా తయారైందని.. మంత్రులందరూ అవినీతిలో కూరుకుపోయారని ధ్వజమెత్తారు.
150రోజుల పని..!
ఉపాధి హామీ పథకంలో భాగంగా కనీసం 100రోజుల పని కల్పించలేక ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని స్టాలిన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 150 పనిదినాల కోసం కేంద్రంతో పోరాడతామన్నారు.
ఇదీ చదవండి: తమిళనాట వచ్చేది డీఎంకే ప్రభుత్వమే: స్టాలిన్