పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం నేపథ్యంలో కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ బిల్లుపై అధ్యాత్మిక గురువు శ్రీశీ రవిశంకర్, తమిళ గీత రచయిత వైరముత్తు స్పందించారు. మూడు దశాబ్దాలుగా భారత్లో తలదాచుకుంటున్న శ్రీలంక తమిళులకు పౌరసత్వం కల్పించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
"35 ఏళ్లుగా తమిళనాడులో ఉంటున్న లక్ష మందికిపైగా శ్రీలంక శరణార్థులకు పౌరసత్వం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి నా విన్నపం. ఈ అంశాన్ని కేంద్రం పరిశీలించాలి."
-శ్రీ శ్రీ రవిశంకర్
శ్రీలంక తమిళులు శరణార్థులుగానే ఉండాల్సి వస్తోంది తప్ప... భారతీయులుగా గుర్తింపు పొందలేకపోయారని వైరముత్తు ఆవేదన వ్యక్తం చేశారు.
"శ్రీలంక శరణార్థులను పొరుగు దేశ పౌరులుగా భావించకూడదు. వారికీ భారతీయ పౌరసత్వం వర్తించేలా బిల్లును సవరణ చేసి మానవత్వం చూపాలి. "
-వైరముత్తు
ఇదీ చూడండి : 'కశ్మీర్ రాజకీయ నేతల విడుదల మా చేతుల్లో లేదు'