ETV Bharat / bharat

చేపల వేట కోసం పులులతో పోరాటం - Bengal Pirkhali

బతుకే ఓ పోరాటం. బతకాలంటే నిత్యం ఏదో ఒకదానితో యుద్ధం చేస్తూనే ఉండాలి. అక్కడి గ్రామాల ప్రజలు కడుపు నింపుకునేందుకు ఏకంగా చావుకే ఎదురెళ్లాల్సిన పరిస్థితి. తినేందుకు ఏదైనా తెస్తాడని ఇంట్లో ఎదురుచూస్తున్న భార్యాబిడ్డలకు ఇంటి పెద్ద చావు కబురు ఏ క్షణాన వినిపిస్తుందో ఊహించలేని దుస్థితి. ఇంతటి దుర్భర పరిస్థితుల్లోనూ వారికి మరో బతుకుదెరువు కనిపించడం లేదు.

SPECIAL STORY ON WEST BENGAL FISHERMENS
చేపల వేట కోసం పులులతో పోరాటం
author img

By

Published : Oct 7, 2020, 6:17 PM IST

చేపల వేట కోసం పులులతో పోరాటం

అడవి ఓ రాజ్యమైతే.. దాన్ని పులులు పాలిస్తాయి. నిస్సహాయ జంతువులు ఏదో ఒకరోజు వాటికి ఆహారంగా మారతాయి. ఇది సృష్టి ధర్మం. అదే అక్కడి వారికి శాపంలా మారింది. చేపల వేటకు, తేనె సేకరణే వారికి జీవనాధారం. బతుకుదెరువు కోసం అడవిలోకి వెళ్లిన వాళ్లు తిరిగి వస్తారో, రారో చెప్పలేని పరిస్థితిలో బతుకుతున్నారు. అక్కడ భర్తలను కోల్పోతున్న మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

గతేడాది 11 మంది బలి!

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2019లో ఇక్కడ పులులకు ఆహారంగా మారినవారి సంఖ్య అధికారికంగా 4. కానీ నిజానికి 11 మంది పులుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

బంగాల్​ నేతిధూపాని, పీర్‌ఖాలి, చుట్టుపక్కల గ్రామాల్లో పులులకు బలై.. భర్తలను కోల్పోయిన మహిళల సంఖ్య పెరుగుతోంది. చేపల వేటకు వెళ్లిన గోసాబా గ్రామస్థులు శ్రీనాథ్ మోండల్, సుబాల సర్దార్ లాంటి ఎంతోమంది తిరిగి రాలేదు. భర్త జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్న శ్రీనాథ్ భార్య రీటా తన భర్త ఇంకెప్పటికీ రాడన్న చేదునిజం జీర్ణించుకోలేకపోతోంది.

"నా భర్త చనిపోయారని నాకెవరూ చెప్పలేదు. నా ఇంటిముందు జనం గుమిగూడారే తప్ప, నాకేం చెప్పలేదు. చాలా భయపడ్డాను. ఆయన ఇకలేరన్న నిజం నాకు తెలిసింది."

- రీటా మోండల్, పులిదాడిలో భర్తను కోల్పోయిన మహిళ

బతికి బట్టకట్టాడు..

శ్రీనాథ్, సుబాల్‌తో కలిసి, అదేరోజు మనోరంజన్ జానా సైతం అడవికి వెళ్లాడు. ఆయన మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.

"మేం చేపలు పడుతున్న సమయంలో ఓ పులి మాపై దాడి చేసింది. శ్రీనాథ్‌ను పట్టుకుని, అడవిలోకి ఈడ్చుకెళ్లింది. అతడి శవం కనిపించింది. నాకూ కొన్ని గాయాలయ్యాయి. కానీ ప్రాణాలతో బయటపడ్డాను."

- మనోరంజన్ జానా, పులిదాడి నుంచి తప్పించుకున్న వ్యక్తి

బతుకు భారమై.. బిక్కుబిక్కుమంటూనే..

పేదరికమే వీరి సమస్యలను జటిలం చేస్తోంది. కాస్త ఎక్కువ సంపాదించేందుకు ప్రాణాలనే అపాయంలోకి నెడుతున్నారు. పులులకు ఆహారంగా మారుతున్నారు. ఒక్కోసారి అడవిలో చని పోయిన వారి శవాలు కూడా దొరకవు. భర్తను కోల్పోయి, పిల్లలపోషణ భారమై, బిక్కుబిక్కుమంటూ బతుకున్న మహిళలు ఇక్కడ ఎంతోమంది.

"చాలారోజుల క్రితం నా భర్త పులి చేతిలో హతమయ్యాడు. నాకో ఉద్యోగం కావాలి. మా ప్రాంతానికి అభివృద్ధి కావాలి."

- బాధితురాలు

పాలకులు ఏమంటున్నారంటే?

వేరే ప్రత్యామ్నాయ ఆదాయమార్గం లేక.. ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ గ్రామస్థులు అడవిలోకే వెళ్లాల్సి వస్తోంది. అందుకే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ యంత్రాంగం మాట మరోలా ఉంది.

"మేం వాళ్లను ఇంతకుముందే హెచ్చరించాం. కానీ మా మాటలు పట్టించుకోరు. పీతలు పట్టుకుని, అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుంది. ఎక్కువ డబ్బు సంపాదించేందుకు సాహసాలు చేస్తున్నారు."

- సుధీర్ రంజన్‌దాస్, అటవీశాఖ అధికారి

ఇక్కడివాళ్లు బతికేందుకు నిత్యం చావుకు ఎదురెళ్లాల్సి వస్తోంది. నేతిధూపని, పీర్‌ఖలీ లాంటి గ్రామాలు ప్రతిరోజూ మౌనంగా రోదిస్తూనే ఉంటాయి.

ఇదీ చదవండి: రోడ్డు పక్కన నీటి పైపుల్లో నవజాత శిశువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.